Zomato UPI: ప్రముఖ ఫుడ్, గ్రాసరీ డెలివరీ సంస్థ జోమాటో సైతం యూపీఐ సేవలను ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ఈ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జోమాటో యూజర్లకు ఇది పుడ్ ఆర్డర్లకు మరింత సులభతరం చేస్తుందని సంస్థ పేర్కొంది. ఇకపై జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే వారు.. గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో పని లేకుండానే నేరుగా జొమాటో యాప్ నుంచే పేమెంట్ చేసేందుకు వీలు కలుగుతుంది. అందుకోసం జోమాటో యాప్‌లో యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఫుడ్ ఆర్డర్ చేస్తున్న చాలా మంది కస్టమర్లు యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్ అయిన గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా పే చేస్తున్నారు. ఈ కారణంతోనే ఐసీఐసీఐ (టెక్నాలజీ పార్టనర్) సహకారంతో యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జొమాటో ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలో క్యాష్ ఆన్ డెలివరీ సేవలను ఎత్తివేయాలన్న ఆలోచనలోనూ జొమాటో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్న సందర్భాల్లో కస్టమర్ ఆహారాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందుకే ఆ సీఓడీ విధానానికి స్వస్తి పలకాలని జొమాటో భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మార్కెట్లో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలదే మెజారిటీ వాటా. దీంతో ఆయా యాప్స్‌పై అతిగా ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తోంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అందుకే ఏ ఒక్క కంపెనీ కూడా 30 శాతానికి మించి మార్కెట్ వాటా కలిగి ఉండకూడదని నిర్ణయించింది. ఇందు కోసం 2024, డిసెంబర్ 31 డెడ్‌లైన్ పెట్టింది. అందులో భాగంగానే వేర్వేరు సంస్థలకు యూపీఐ సేవలను అందించేందుకు అనుమతి ఇస్తోంది. జొమాటో బాటలోనే మరో ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సైతం త్వరలోనే యూపీఐ సేవలు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్టు సైతం యూపీఐ సేవలు తీసుకొస్తే చాలా వరకు గూగుల్ పే, ఫోన్ పేలపై ఆధారపడటం తగ్గుతుందనే చెప్పాలి.

ప్రస్తుతం మార్కెట్లో గూగుల్ పే, ఫోన్, పేటీఎంతో పాటు చాలా రకాల కంపెనీలు యూపీఐ పేమెంట్స్ సేవలు అందిస్తున్నాయి. అందులో అమెజాన్ పే, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్, మొబిక్విక్, శాంసంగ్ పే, వాట్సాప్ పే, ఎన్‌పీసీఐ బీమ్ యాప్ వంటివి యూపీఐ సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు జొమాటో ఆ జాబితాలో చేరిపోయింది. త్వరలోనే మరిన్ని సంస్థలు యూపీఐ సేవల్లోకి రానున్నాయి.
- Read Latest Business News and Telugu News