పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ సమాధాన పత్రాలు పొందడానికి ఎంసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి పొందవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అగ్రికల్చర్ విభాగం అభ్యర్థులు మే 16వ తేదీలోపు.. ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థులు మే 17వ తేదీలోపు వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా పంపవచ్చు.
ఇక.. మూడు రోజులపాటు.. ఆరు విడతల్లో జరిగిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని సోమవారం రాత్రి 8 గంటలకు విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థుల రెస్పాన్స్ పత్రాలను కూడా వెబ్‌సైట్లో ఉంచుతామని, ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థనలను 17వ తేదీ రాత్రి 8 గంటలకు వెబ్‌సైట్లోని లింక్ ద్వారా పంపవచ్చని పేర్కొంది. మొత్తంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 94.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,05,351 మందికి 1,95,275 మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది పరీక్షకు హాజరయ్యారు.