డాక్టర్స్ ఏమంటున్నారంటే..

బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్ ద్వివేది హై కొలెస్ట్రాల్ స్థాయిలు అధిక రక్తపోటుకి ఎలా కారణమవుతాయో, చెడు కొలెస్ట్రాల్‌ని ఎలా తగ్గించాలో చెబుతున్నారు.
Also Read : After 30 : 30 ఏళ్ళ తర్వాత ఆడవారికి వచ్చే సమస్యలివే..
కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు టిప్స్..
హై కొలెస్ట్రాల్‌తో హైబీపికి ఎలా కారణమవుతుందంటే..

హైకొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే సరైన మందులు తీసుకోవడం, మంచి లైఫ్‌స్టైల్ పాటించడం చాలా ముఖ్యం. ఈ టైమ్‌లో కొలెస్ట్రాల్ ఉన్నవారికి హైబీపి ఉంటే రక్తపోటుని చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.
మీ రక్తనాళాల గోడలకు వ్యతిరేకంగా మీ రక్తంలో శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు హైబీపి వస్తుంది. కొలెస్ట్రాల్ రక్తనాళాలను అడ్డుకుంటుంది. ఇరుగ్గా చేస్తుంది. మీ గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది.
కొలెస్ట్రాల్ అంటే..

డాక్టర్స్ ప్రకారం, శరీర కణాల సరైన పనితీరుకు ఓ ముఖ్య అంశం కొలెస్ట్రాల్. ఎలివేటెడ్ స్థాయిలు రక్తనాళాలను నిరోధించవచ్చు. ఇది రక్తప్రవాహాన్ని నెమ్మదిగా చేయడం, ఆపేయడం చేస్తుంది. ఈ కారణంగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీల ఫెయిల్యూర్స్, ఇతర సమస్యలు, ప్రాణాంతక సమస్యలకి దారితీస్తుంది.
ఏం తినాలంటే..

బ్యాలెన్డ్స్ ఫుడ్‌తో కొలెస్ట్రాల్‌ని తగ్గించొచ్చు, నియంత్రించొచ్చు. మీ ఫుడ్‌లో పాలీ అన్ శాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఫుడ్స్ తీసుకోవాలి. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్‌ని కంట్రోల్ చేయొచ్చు.
Also Read : Liver Health : సరిగ్గా నడవలేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లేనా..
మెడిసిన్..

కొన్నిసార్లు హెల్దీ ఫుడ్ తీసుకోవడం కూడా కొలెస్ట్రాల్‌ని తగ్గించదు. అలాంటప్పుడు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి కొన్ని మెడిసిన్ అవసరం అవుతాయి.
ఇంజెక్షన్స్..

మీరు నోటి ద్వారా తీసుకునే మెడిసిన్ వద్దనుకుంటే, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె దెబ్బతినకుండా కాపాడే ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం, రెగ్యులర్ వర్కౌట్స్, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెంటెయిన్ చేయడానికి బెస్ట్ ఆప్షన్.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Health News and Telugu News