Sunday, June 4, 2023

GT vs SRH: శతకం బాదిన శుభమన్ గిల్.. హైదరాబాద్ టార్గెట్ 189

ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill)సెంచరీ బాదేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అహ్మదాబాద్ వేదికగా సోమవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో శుభమన్ గిల్ (101: 58 బంతుల్లో 13×4, 1×6) శతకం బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గిల్‌తో పాటు సాయి సుదర్శన్ (47: 36 బంతుల్లో 6×4, 1×6) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పడగొట్టేశాడు. అలానే జాన్‌సెన్, ఫరూఖి, నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ మార్‌క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు దాంతో గిల్‌తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన సాహా (0) ఫస్ట్‌లోనే డకౌటయ్యాడు. అనంతరం వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి శుభమన్ గిల్ దూకుడుగా ఆడేశాడు. రెండో వికెట్‌కి 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గిల్.. ఐపీఎల్ కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే.. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఔటైపోగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు.

కెప్టెన్ హార్దిక్ పాండ్య (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3), దసున్ శనక (9), రషీద్ ఖాన్ (0), నూర్ అహ్మద్ (0), మహ్మద్ షమీ (0) వరుసగా ఔటైపోయారు. లాస్ట్ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 2 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇదే ఓవర్‌లో నూర్ అహ్మద్ రనౌటయ్యాడు. దాంతో గుజరాత్ 188 రన్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Latest news
Related news