Sunday, June 4, 2023

FD RATES, Fixed Deposits: డబ్బులు ఏ బ్యాంకులో దాచుకుంటే సేఫ్.. ఎక్కువ లాభం ఎందులో వస్తుందంటే? – latest fixed deposit interest rates check bank fd rates here


Fixed Deposits: మీరు గనుక డబ్బుల్ని బ్యాంకులో దాచుకోవాలని అనుకుంటుంటే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. వడ్డీ రేట్లు ఏ బ్యాంకుల్లో ఎక్కువగా ఉన్నాయి.. రిటర్న్స్ ఎందులో బాగా వస్తాయి.. వంటి విషయాలను చెక్ చేసుకోవాలి. వడ్డీ ఎక్కువ వచ్చే బ్యాంకులో డబ్బులు దాచుకోవడం మంచిది. అయితే ఆ బ్యాంక్ చరిత్రను కూడా తెలుసుకోవాలి. ఇక ఏడాది నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధిపై ఏయే బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం ఏడాది నుంచి ఐదేళ్ల వ్యవధి ఉన్న FD పై 5.75 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5.75 శాతం నుంచి 7.25 శాతం వరకు ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5.5 శాతం నుంచి 7.15 శాతం వరకు వస్తుంది.ఇదే కెనరా బ్యాంకులో ఏడాది నుంచి ఐదేళ్ల టెన్యూర్ ఉన్న ఎఫ్‌డీపై 6.5 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ పొందొచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 7.1 శాతం వరకు ఉంది. ఇండియన్ బ్యాంకులో అయితే తక్కువగా 4.75 శాతం నుంచి 7.15 శాతం వరకు ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇదే వడ్డీ రేటు 5.8 శాతం నుంచి 7.25 శాతం వరకు ఆఫర్ చేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ వడ్డీ రేటు శాతం 5.75 నుంచి 7.1 శాతం వరకు ఉంది. యూనియన్ బ్యాంకులో కనిష్టంగా 5.25 శాతం, గరిష్టంగా 7.3 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది.

ఇక ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్‌లో 6 శాతం నుంచి 7.2 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. బంధన్ బ్యాంకులో ఇది 4.5 శాతం నుంచి 8 శాతం వరకు ఉంది. డీసీబీ బ్యాంకులో 6.25 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఫెడరల్ బ్యాంకులో 6 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

స్థిరంగా బంగారం, వెండి ధరలు

దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీలో ఏడాది నుంచి ఐదేళ్ల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 6 నుంచి 7.1 శాతం వరకు వడ్డీ అందుతుంది. ఐసీఐసీఐ బ్యాంకులో చూస్తే ఇక్కడ కూడా 6 నుంచి 7.1 శాతంగానే ఉంది. IDBI బ్యాంకులో 5.5 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇక ఇదే సమయంలో కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇంకా ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో 6 శాతం నుంచి 9.5 శాతం వరకు వడ్డీని సొంతం చేసుకోవచ్చు.

ఫోన్‌లో యాప్స్ మైక్రోఫోన్ వాడుతున్నాయని అనుమానంగా ఉందా.. ఇలా చెక్ చేసుకోండి!



Source link

Latest news
Related news