‘RRR’ centres in U.P.: 11 నగరాల్లో..
ఉత్తర ప్రదేశ్ లోని లక్నో, కాన్పూర్, వారణాసి, మీరట్, ఆగ్రా, ఘజియాబాద్, ప్రయాగరాజ్, అలీగఢ్, బరేలీ, మొరాదాబాద్, సహారన్ పూర్ నగరాల్లో ఈ ‘ఆర్ (Reduce), ఆర్ (Reuse), ఆర్ (Recycle)’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ (urban 2.0) కింద మేరీ లైఫ్.. మేరా స్వచ్ఛ షెహర్ (Meri Life, Mera Swachh Shehar) ప్రచారంలో భాగంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని మే 20వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇల్లు, వ్యాపార సముదాయాల నుంచి సేకరించిన.. వారికి ఉపయోగంలో లేని వస్తువులను.. ఆయా వస్తువులు అవసరమైన వారికి ఇవ్వడం గానీ, లేదా రీసైకిల్ చేయడం గానీ చేస్తారు.