Sunday, June 4, 2023

Metro Students Pass : విద్యార్థులకు మెట్రో పాస్‌.. అందుబాటులోకి తీసుకొచ్చిన మెట్రో

Metro Students Pass : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. మైట్రో రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రోలో ప్రయాణించే విద్యార్థులకు స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లల్లో విద్యార్థులకు పాస్‌లు ఇచ్చేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (Chennai Metro Rail) సంస్థ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మెట్రో ప్రయాణికుల్లో విద్యార్థుల వాటా 40 శాతం ఉన్నట్టు అంచనా. బస్సులు, రైళ్లల్లోని నెలవారీ పాస్‌ల విధానంలో మెట్రో పాస్‌లు జారీ చేయనున్నట్టు పేర్కొంది.చెన్నై మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజుకు సగటున 2 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇక.. ప్రయాణికుల సౌలభ్యం కోసం చెన్నై మెట్రో రైల్ ఇప్పటికే పలు రాయితీలను అందిస్తోంది. రోజంతా ప్రయాణించేందుకు రూ.100 టిక్కెట్.. నెలంతా ప్రయాణించేవారి కోసం రూ. 2500 పాస్.. బృందంగా ప్రయాణించే వారికి ఛార్జీల తగ్గింపు వంటి పలు రాయితీలను ప్రకటించింది. అయితే.. తమకు కూడా రైళ్లలో ప్రయాణించేందుకు అనుకూలంగా తక్కువ ధరకు పాస్ లు జారీ చేయాలని విద్యార్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. తాజాగా విద్యార్థులకు మెట్రోలో పాస్‌ ఇవ్వాలని నిర్ణయించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

SSC CHSL 2023 : ఇంటర్‌ పాసైతే చాలు.. 1600 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ వచ్చేసింది
SSC CHSL 2023 Notification : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌- (SSC CHSL 2023) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి

Inter Admissions 2023 : జూన్‌ 1 నుంచి క్లాసులు ప్రారంభం.. నేటి నుంచి అడ్మిషన్లు షురూ..!

Latest news
Related news