Thursday, June 1, 2023

google employee perks, Google Employees: గూగుల్ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ.. ఉద్యోగాలు పోతుండగా మరో కీలక ప్రకటన.. అవన్నీ బంద్! – google is slashing these employee perks in latest cost cutting drive


Google Employees: మామూలుగా ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరేముందు అక్కడ వర్క్ కల్చర్, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ బాగున్నాయా లేదా అని కచ్చితంగా చూస్తుంటాం. ముఖ్యంగా ఆహ్లాదకర వాతావరణం, వేతనాలు, ఉద్యోగులకు అందించే ఇతర సౌకర్యాలు.. ప్రోత్సాహకాల గురించి ప్రత్యేకంగా చూస్తుంటారు ఉద్యోగుల. ఇక గూగుల్ గురించి చెప్పనక్కర్లేదు. గూగుల్ ఆఫీసులు అంటే ముందు అక్కడి సౌకర్యాలే గుర్తొస్తాయి. అక్కడి సౌకర్యవంత పని వాతావరణం గురించి.. అక్కడ పనిచేసే వారు చెబుతూ ఉంటారు. అంత బాగుంటుందంట. వారు సౌకర్యంగా ఆ అనుభూతి కల్పించేందుకు.. వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ తయారు చేసుకునేందుకు వీలుగా మైక్రో కిచెన్స్, ఉచిత లాండ్రీ సేవలు, కంపెనీ స్వయంగా స్పాన్సర్ చేసే మధ్యాహ్న భోజనాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. అయితే ఇక ఇవన్నీ క్రమంగా ఉద్యోగులకు దూరం కానున్నాయట.ఇప్పటికే ఇటీవల వేలాది మంది ఉద్యోగులను ఒక్కసారిగా తీసేసి షాక్ ఇచ్చిన గూగుల్.. ఇప్పుడు అందులో పనిచేసే ఉద్యోగులకు ప్రోత్సాహకాలను కట్ చేయనున్నట్లు సమాచారం. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఇలా ఇప్పటికే చేసినట్లు తెలిసింది. ఉద్యోగులకు అందించే ఫ్రీ స్నాక్స్, మధ్యాహ్న భోజనం, మసాజ్, లాండ్రీ వంటి సౌకర్యాలు ఇక ఉండవని తెలుస్తోంది. డబ్బులను పొదుపుగా వాడుకుంటూ.. దుబారా ఖర్చులు చేయకుండా ఉండాలని యోచిస్తోంది.

ChatGPT: లేటెస్ట్ సెన్సేషన్ చాట్‌జీపీటీని బ్యాన్ చేసిన యూరప్ దేశం.. ఆ భయాలే కారణమా.. అందరిలోనూ ఇవే ప్రశ్నలు!IT Jobs: గుడ్‌న్యూస్.. మాంద్యం భయాలున్నా ఈ దిగ్గజ భారతీయ ఐటీ కంపెనీ ఉద్యోగాల ప్రకటన.. పెద్ద ఊరట!

ఈ సందర్భంగా గూగుల్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రూత్ పొరాట్ స్పందించారు. సంస్థ ప్రస్తుతానికి అధిక ప్రాధాన్యం ఉన్న పనులపై మాత్రమే డబ్బుల్ని సమర్థంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రోత్సాహకాల నిలిపివేతపై ఉద్యోగులకు ఇప్పటికే గూగుల్ మెమో జారీ చేసిందంట. ఇదే సమయంలో గూగుల్ అందించే ల్యాప్‌టాప్స్ కూడా వెనక్కి తీసుకోవడంతో పాటు.. ఇతర సదుపాయాల్ని కూడా సర్దుబాటు చేయాల్సి వస్తుందని ఆయన చెప్పినట్లు తెలిసింది.

మైక్రో కిచెన్ల అవసరాన్ని బట్టి ఉంటాయని, తినేవారు తక్కువ మంది ఉంటే వాటిని మూసివేయడం వంటి వాటి దిశగా ఆలోచిస్తోంది గూగుల్. ఇక్కడే ఆహారం వృథా కావొద్దని అందులో భాగంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఫిట్‌నెస్ క్లాసుల్ని షెడ్యూల్ చేయడంతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఇక గూగుల్ ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో అత్యంత అవమానకరంగా చాలా మందిని బయటికి పంపించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఇక తొలగించిన వారిలో చాలా మందికి పెయిడ్ లీవ్స్, మెటర్నిటీ లీవ్స్‌కు సంబంధించిన డబ్బులు చెల్లించలేదని సమాచారం.

Ola Electric: రికార్డులు బద్దలు కొడుతున్న ఓలా ఎలక్ట్రిక్.. ఒక్క నెలలోనే 27 వేల స్కూటర్ల అమ్మకాలు.. తెగ డిమాండ్Hyderabad: తెలంగాణలో 11 రోజులు బ్యాంకులు బంద్.. ఏప్రిల్ నెల బ్యాంక్ సెలవుల ఫుల్ లిస్ట్ ఇదే.. పనులుంటే చూస్కొని వెళ్లండి..Source link

Latest news
Related news