Thursday, June 1, 2023

pan card, Small Saving Schemes: PPF, సుకన్య సమృద్ధి వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కొత్త రూల్స్.. అది తప్పనిసరి.. – aadhaar, pan becomes mandatory for ppf, ssy other small saving schemes


Aadhaar Pan: చిన్న మొత్తాల సేవింగ్ స్కీమ్స్‌కు సంబంధించి కేంద్రం ప్రభుత్వం మార్చి 31న కీలక ప్రకటన చేసింది. సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్స్ సహా ఇతర పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. ఇది 10 నుంచి 70 బేసిస్ పాయింట్ల వరకు ఉంది. ఇక ఇప్పుడు ఈ చిన్న పొదుపు పథకాల్లో కొన్ని మార్పులను కూడా తీసుకొచ్చింది. అవన్నీ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇదివరకే ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధాన గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌కు సంబంధించి మరో కొత్త రూల్ తీసుకొచ్చింది. దీనిపై శుక్రవారమే కీలక ప్రకటన చేసింది కూడా. చిన్న పొదుపు పథకాలైన సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీమ్, సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్, పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాలకు పాన్ కార్డు, ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆధార్, పాన్ తప్పనిసరి అన్నమాట. ఇందులో పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇవే పొదుపు పథకాల అకౌంట్లలో ఇన్వెస్ట్‌మెంట్లు నిర్ణీత పరిమితిని దాటితే అప్పుడు పాన్ కార్డును అందించాల్సిందిగా నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.

ఇదే సమయంలో ఆధార్ కార్డు లేకుండా ఈ ఖాతా తెరచిన చందాదారులు 2023, సెప్టెంబర్ 30లోగా సంబంధిత ఆఫీసుల్లో ఆధార్ కార్డు సమర్పించాలని స్పష్టం చేసింది. అంటే 6 నెలల గడువు ఇచ్చింది. ఇప్పటినుంచి కొత్త ఖాతాలు తెరిచే వారు మాత్రం ఆధార్ కార్డు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఖాతా ఉన్న వారు 6 నెలల్లో సబ్మిట్ చేయాలి. ఇలా చేయని పక్షంలో 6 నెలల తర్వాత ఖాతాను ఫ్రీజ్ చేస్తారు.

Jio Postpaid Plans: జియో అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా ఇంకెన్నో బెనిఫిట్స్.. 30 రోజుల ఫ్రీ ట్రయల్!Hyderabad: తెలంగాణలో 11 రోజులు బ్యాంకులు బంద్.. ఏప్రిల్ నెల బ్యాంక్ సెలవుల ఫుల్ లిస్ట్ ఇదే.. పనులుంటే చూస్కొని వెళ్లండి..

ఇక పాన్ కార్డును కూడా ఖాతా తెరచిన 2 నెలల్లోగా సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఆ సందర్భాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాతాల్లో రూ.50 వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు..

ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతాలో అన్ని క్రెడిట్స్ రూ. లక్ష దాటినప్పుడు

ఒక నెలలో సదరు ఖాతా నుంచి జరిపిన ట్రాన్సాక్షన్లు, విత్‌డ్రాలు కలిసి రూ. 10 వేలు దాటినట్లయితే.. అప్పుడు పాన్ కార్డు సమర్పించాలి. ఇలా చేయకుంటే మాత్రం అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. తిరిగి పాన్ కార్డు సబ్మిట్ చేసేంతవరకు ఎలాంటి లావాదేవీలు జరిపేందుకు వీలుండదు.

ChatGPT: లేటెస్ట్ సెన్సేషన్ చాట్‌జీపీటీని బ్యాన్ చేసిన యూరప్ దేశం.. ఆ భయాలే కారణమా.. అందరిలోనూ ఇవే ప్రశ్నలు!Ola Electric: రికార్డులు బద్దలు కొడుతున్న ఓలా ఎలక్ట్రిక్.. ఒక్క నెలలోనే 27 వేల స్కూటర్ల అమ్మకాలు.. తెగ డిమాండ్



Source link

Latest news
Related news