Thursday, June 1, 2023

Delhi Capitals డగౌట్‌లో రిషబ్ పంత్ జెర్సీ.. మాజీ కెప్టెన్‌కి అరుదైన గౌరవం

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌ (Rishabh Pant)కి అరుదైన గౌరవం దక్కింది. కారు యాక్సిడెంట్‌లో గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023(IPL 2023)కి దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ అతని గౌరవార్థం ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో రిషబ్ పంత్ జెర్సీని ఆ టీమ్ మేనేజ్‌మెంట్ వేలాడదీసింది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ ప్లేయర్ జెర్సీలో డగౌట్‌లో ఉంచడం ఇదే తొలిసారి.

లక్నో వేదికగా శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ నడిపిస్తున్నాడు. అయితే టోర్నీలో ఆడలేకపోయినా.. ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో పంత్ ఉంటే చాలని మొదటి నుంచి ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్ చెప్తోంది. కానీ.. సర్జరీల నుంచి కోలుకుంటున్న పంత్ ఇంటి దగ్గర నుంచే మ్యాచ్‌లు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడ్ని గుర్తు చేసుకుంటూ స్టేడియంలోని ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో జెర్సీని వేలాడదీశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఏడు మ్యాచ్‌లను ఈ ఏడాది ఆడనుంది. ఆ మ్యాచ్‌లని వీక్షించేందుకు రిషబ్ పంత్ స్టేడియానికి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే? స్టేడియంలో నేరుగా ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌కి రిషబ్ పంత్ చేరుకునేలా స్పెషల్ ర్యాంప్‌ని ఏర్పాటు చేస్తామని డీడీసీఏ ఇప్పటికే ప్రకటించింది. అలానే పికప్, డ్రాపింగ్ బాధ్యతల్ని కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news