Thursday, June 1, 2023

పెళ్ళి చేసుకుంటానని నమ్మించి.. ఇప్పుడిలా.. – dont get cheated by online fraudsters here’s how to protect yourself

సోషల్ మీడియా.. ఇది ప్రపంచాన్నే దగ్గర చేసింది. కానీ, అదే ప్రపంచంలో కొందరినీ వెర్రివాళ్ళని కూడా చేస్తుంది. తన మాయలో పడేసి పిచ్చివాళ్ళని చేసి నవ్వుతుంది. దీని ట్రాప్‌లో పడి చాలా మంది డబ్బు, మనశ్శాంతి, పరువు, ఆఖరికి ప్రాణాలే పోగొట్టుకున్నవారు ఉన్నారు. అలాంటి ఓ స్టోరీ గురించి తెలుసుకోండి.

హాయ్.. నా పేరు అంకిత..

హాయ్.. నా పేరు అంకిత..

నేను ఓ మంచి ఉద్యోగంలో ఉన్నా. నా ఫాస్ట్‌ లైఫ్‌లో ఎంత స్ట్రగుల్ అయ్యానో.. ఆ బాధలే నన్ను జీవితాన్ని గెలిచేలా చేశాయి. నన్ను చూసి జాలి పడిన వారికి నేనే రోల్ మోడల్‌గా నిలిచా.. ఇదంతా సాధించేందుకు నాకు కొన్ని సంవత్సరాలే పట్టింది. అంతా సాధించి అప్పుడే రిలాక్స్ అవుతున్న టైమ్‌లో సోషల్ మీడియాలో కాస్తా టైమ్ స్పెండ్ చేద్దామనుకున్నా.. ఓ వ్యక్తి అదే పనిగా పలకరిస్తుంటే.. నేను ఏదో మేధావిలా తనని టెస్ట్ చేసి మరి నా లైఫ్‌లోకి రెడ్ కార్పెట్ వేసి మరి ఆహ్వానించా.

మెసేజ్‌ల నుంచి ఫోన్స్ వరకూ..

మెసేజ్‌ల నుంచి ఫోన్స్ వరకూ..

సోషల్ మీడియా మెసేజ్ నుంచి ఫోన్స్ వరకూ జరిగిన ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు. కానీ, అయినా నమ్మా. తను దేశం కాని దేశంలో ఉన్నా ఎదురుచూశా. వచ్చాక కష్టాలు తీరుస్తానంటూ మాటిచ్చిన వ్యక్తి కోసం కళ్ళల్లో వత్తులేసుకుని మరీ ఎదురుచూశా. అతను వచ్చాడు. వచ్చాక ఏమైందంటే..

ప్రేమకి అడ్డురాని ఫ్యామిలీ.. పెళ్ళికి మాత్రం..

ప్రేమకి అడ్డురాని ఫ్యామిలీ.. పెళ్ళికి మాత్రం..

స్వదేశానికి వచ్చిన వ్యక్తి.. విదేశాల్లో ఉన్నంత ప్రేమగా లేడు. వచ్చిన తొలి చూపులో చూసి వెళ్ళాడు. మళ్ళీ మళ్ళీ వస్తూ కలుస్తూనే ఉండేవాడు. పెళ్ళి మాటెత్తేసరికి ఫ్యామిలీ డ్రామా.. అమ్మ, అక్క, కులమంటూ పిచ్చిమాటలు మాట్లాడుతూ కాలక్షేపం. అది నిజమేనని తనని నవ్వుతూ ఉండాలని చూస్తూ ఉరుకున్నా. గుడ్ టైమ్ ఇవ్వాలని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు.

Also Read : Foods for Romance : సమ్మర్‌లో దొరికే ఈ పండు తింటే శృంగారం బాగా చేస్తారట..

శారీరక వేధింపుల వరకూ..

శారీరక వేధింపుల వరకూ..

ఎప్పుడూ మ్యారేజ్ చేసుకుందామని ప్రశ్నించినా.. అతని ఫ్యామిలీని అడ్డుపెట్టుకోవడం అలవాటైంది. ఓపిక నశించింది. పెళ్ళి గురించి అడిగేసరికి చేయి కూడా చేసుకున్నాడు. నాలుగేళ్ళ నిరీక్షణకి తను ఇచ్చిన ఈ బహుమతి నా కళ్ళని తెరిపించింది. ఇంకా ఇక్కడ అతగాడికి చాలా అలవాట్లే ఉన్నాయండి.. అవి గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

నాతో పాటు మరికొందర్ని..

నాతో పాటు మరికొందర్ని..

ఈ తతంగమంతా నా ఒక్కదానితో కాదు.. చాలా అమ్మాయిలతోనే నడుపుతున్నాడు. సోషల్ మీడియా ప్రొఫైల్ లాక్ చేసి ఒకరికి తెలియకుండా ఒకరితో ట్రాక్స్ నడుపుతూ ఒకరి దగ్గర ఉన్నప్పుడు మరొకరికి తెలియకుండా మ్యానేజ్ చేయడం మొదలుపెట్టాడు. అతని ఫోన్‌ని ఎంతలా సీక్రెట్‌గా ఉంచుతాడంటే.. కలలో కూడా ఫోన్‌ని వదలలేడు. ఓ సారి వారం పాటు ఫోన్, మెసేజ్ లేదు. అడిగితే స్నేహితుడి మరణంతో డిప్రెషన్ అంటూ నాటకాలు.. అప్పటికీ అర్థం కాని నేను అదే నమ్మకంతో ఉన్నా. కానీ, ఆ సమయంలో అతడు వేరేవారితో..

​నెంబర్స్ చూసి షాక్..

​నెంబర్స్ చూసి షాక్..

నాకు సోషల్ మీడియాలో మెసేజ్ చేసిన విధంగానే.. వేరేవారితోనూ అదే రేంజ్‌లో చాటింగ్. ఫోన్‌లో బూతు బొమ్మలు, అతని ఏజ్‌తో సంబంధం లేదు. ఆడవారైతే చాలు. ఫోన్లో వేరే వారి నెంబర్స్ చూసి నేను షాక్ అయ్యా. నా నెంబర్ మాత్రమే ప్రేమతో ఉంచాడనుకున్నా. కానీ, తనకి ప్రతి నెంబర్‌పై మోజే..
Also Read : Expert solutions : నా వైఫ్ అలా మాట్లాడుతుంటే నా పేరెంట్స్ బాధపడుతున్నారు..

వరుసలు లేవ్..

వరుసలు లేవ్..

నా దగ్గరకి వచ్చినప్పుడు ఎంత ప్రేమగా ఉంటాడో.. వేరే దగ్గర ఉన్నప్పుడు నేనెవరో తెలీనట్లుగా ఫ్యామిలీ దగ్గర హైడ్ చేస్తున్నాడు. అంతే కాదు, వరుసలు లేని మహిళల దగ్గరికి వెళ్ళి కాలక్షేపం.. ఇవన్నీ చూసి విసిగిపోయా. నాకు ఇలాంటి వ్యక్తిని ఎందుకు పరిచయం చేశావంటూ నన్ను నేనే తిట్టుకున్నా. ఇవన్నీ నా హెల్త్‌పై చాలా ఎఫెక్ట్ చూపాయి. ఆరోగ్యం పాడైంది. ఎప్పుడు ఏమవుతుందోననే భయంతోనే బతుకుతున్నా.

ఎందుకు చెబుతున్నానంటే..

ఎందుకు చెబుతున్నానంటే..

ఎంత జాగ్రత్తగా ఉన్నా అడుగడుగునా ఇలా వంచించేవారు ఉన్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఇందులో నా తప్పు కూడా ఉంది. అందుకే ఏడుస్తూ.. చావుకోసం ఎదురుచూస్తున్నా.. మీరు నాలా మోసపోవద్దు. సోషల్ మీడియా మోసగాళ్ళు చుట్టూతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త.

గమనిక : ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే తెలియజేస్తుంది. ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.
​Read More : Relationship News and Telugu News

Latest news
Related news