Thursday, June 1, 2023

Summer Holidays 2023 : స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?

Summer Holidays 2023 : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వేసవి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు (Summer Holidays) ఇస్తున్నట్లు ప్రకటించింది. కొత్త విద్యా సంవత్సరం (2023-24) జూన్ 12న ప్రారంభమవుతుందని పేర్కొంది. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 నిర్వహించనున్నారు. ఇక 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 6 నుంచి 8వ తరగతులకు 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మ.12:30 గంటల వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం సెలవులు ఇవ్వనున్నారు.ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు:
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి మార్నింగ్ 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం 11 పేపర్లకు బదులు 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. హాల్‌టికెట్లను స్కూళ్లకు పంపారు. మరోవైపు అధికారిక వెబ్‌సైట్‌లోనూ హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

10వ తరగతి పరీక్ష తేదీలివే: ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది.

చివరి 15 నిమిషాల్లోనే బిట్ పేపర్.. అలాగే..
10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు ఇచ్చే మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నపత్రం (బిట్‌ పేపర్‌)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. అంతేకాకుండా జనరల్‌ సైన్స్‌ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని పేర్కొంది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే మోడల్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా.. ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది.

మరిన్ని విద్య, ఉద్యోగ సంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి

Latest news
Related news