Thursday, June 1, 2023

centre asks ias, Stock Market: కేంద్రం కీలక నిర్ణయం.. IAS, IPS, IFS పెట్టుబడులపై కీలక ఆదేశాలు.. ఆ వివరాలన్నీ..! – centre asks ias, ips, ifs officers to inform it about their stock market related transactions


Stock Market: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ (అఖిల భారత సర్వీస్) లలో ఉన్నవారికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు, షేర్లు, ఇతర పెట్టుబడి పెట్టే సాధనాల్లో చేసే ట్రాన్సాక్షన్ల విలువ వారి 6 నెలల మూలవేతనం కంటే ఎక్కువగా ఉంటే.. ఆ వివరాలను ఇకపై కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం.. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. . ఆల్ ఇండియా సర్వీస్ 1968 నిబంధనల్లోని రూల్ 16(4) కిందట.. ప్రతి సంవత్సరం వెల్లడించే వివరాలకు తాజాగా సమర్పించాల్సిన సమాచారం అదనమని స్పష్టం చేసింది కేంద్రం. ఈ నిబంధనలు IAS, IPS సహా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఉన్నవారందరికీ వర్తిస్తాయని వెల్లడించింది.ఇక ఇదే సమయంలో Rule 14(1) ప్రకారం.. అఖిల భారత సర్వీస్‌లో ఉన్న ఏ వ్యక్తి కూడా స్టాక్స్, షేర్లు, ఇతర పెట్టుబడి సాధనాలపై ఊహాజనిత పెట్టుబడులు పెట్టడం అనేది సరికాదని గుర్తుచేసింది. తరచుగా స్టాక్స్, షేర్లు, ఇతర సెక్యూరిటీల్లో కొనుగోళ్లు, అమ్మకాలు ఊహాజనిత మదుపుగానే భావించాలని గుర్తుచేసింది.

IRCTC eWallet: క్షణాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్.. ఐఆర్‌సీటీసీ ఇ వ్యాలెట్‌తోనే సాధ్యం.. దీని గురించి మీకు తెలుసా?

ఇక సెక్యూరిటీలు, షేర్లు, డిబెంచర్స్ వంటివి చరాస్తుల కిందకు వస్తాయని గుర్తుచేసింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో వ్యక్తిగత లావాదేవీల విలువ 2 నెలల మూలవేతనం కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఆ వివరాలు కూడా రూల్ 16(4) ప్రకారం.. సంబంధిత అధికారులకు తెలియజేయాలని వెల్లడించింది. ట్రాన్సాక్షన్ పూర్తి అయిన నెల రోజుల లోపు సమాచారం అందించాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న ఆదేశాలు అదనమని వివరించింది.

JP Taparia: దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్.. వార్నీ వందల కోట్లతో కొనుగోలు.. అంబానీ, అదానీ కాదు ఎవరంటే?Gautam Adani: అదానీ ఆశలు ఆవిరి.. ఒక్క రిపోర్ట్‌తో వ్యాపార కోటకు బీటలు.. గొప్ప గొప్ప ఆశయాలన్నీ వెనక్కి.. నెక్ట్స్ ఏంటి?



Source link

Latest news
Related news