Thursday, June 1, 2023

Sajjala On MLC Elections : టీడీపీకి ఎవరు ఓటు వేశారో గుర్తించాం.. ఓటమిపై విశ్లేషిస్తాం

గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గెలవటం కష్టం అనుకున్న సీటులో అభ్యర్థిని నిలబెట్టి ఎగరేసుకుపోయింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ నుంచి బరిలో ఉన్న పంచుమర్తి అనురాధ(panchumarthi anuradha)కు 19 ఓట్లే ఉంటే.. 23 ఓట్లు పడ్డాయి. ఇందులో రెండు ఓట్లు అధికార పార్టీ నుంచి వస్తాయని ముందే ఊహించినప్పటికీ… మరిన్ని ఓట్లు కూడా అనురాధకు పడటంతో వైసీపీ ఓ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి ఏడు స్థానాలే తమవే అంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ.. ఓ సీటు కోల్పోవటం సంచలన పరిణామంగా మారింది. అసలు ఆ రెండు ఓట్లు ఎలా పడ్డాయి…? ఎవరు టీడీపీకి వేశారనే దానిపై చర్చించే పనిలో పడింది ఫ్యాన్ పార్టీ. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గుంటూరుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే టీడీపీకి ఓటు వేశారన్న చర్చ జోరుగా జరుగుతోంది.

Source link

Latest news
Related news