దాతలకు కంపెనీ ముందస్తు చెల్లింపులు కూడా చేస్తుంది. ఆ తర్వాత దాతలు విలువైన కార్గో డ్రై ఐస్ షిప్పింగ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇంకేముంది దీనిని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకోండి. అంతేకాదండోయ్ హ్యూమన్ మైక్రోబ్స్ దాతల వివరాలను గోప్యంగా ఉంచుతుంది. మీరు ప్రైవసీని కొనసాగించేందుకు దాతల వివరాలను పూర్తంగా గోప్యంగా ఉంచతామంటూ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మానవ మలంతో కంపెనీ ఏం చేస్తుంది?
మనుషుల్లో తరతరాలుగా హోస్ట్ నేటివ్ సూక్ష్మజీవులు అనేవి తగ్గిపోతున్నాయి. ఈ సూక్ష్మజీవులను కలిగి ఉన్న వారు 0.1 శాతం కన్నా తక్కువ మంది ఉన్నారు. వారిని గుర్తించి వైద్యులు, పరిశోధకులు, ఆసుపత్రులు, క్లినికల్ ట్రయల్స్‌కు అందించడమే లక్ష్యంగా హ్యూమన్ మైక్రోబ్స్ పని చేస్తోంది. అలా హెస్ట్ నేటివ్ సూక్ష్మజీవులు కలిగి ఉన్న వారి కోసం కంపెనీ వెతుకుతోంది. దీని ద్వారా అధిక నాణ్యత గల మలం దాతలను పరిశోధకులతో కనెక్ట్ చేయవచ్చు. ప్రస్తుతం ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే, హోస్ట్ నేటివ్ సూక్ష్మజీవులు తరాలు మారుతున్న క్రమంలో తగ్గిపోతూ వస్తుండడం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. అయితే, ఎవరైతే ఈ సూక్ష్మ జీవులను కలిగి ఉన్న ఆరోగ్య వంతులను మలాన్ని సేకరించడే కంపెనీ లక్ష్యం.
- Read Latest Business News and Telugu News