Thursday, June 1, 2023

Omega-3 : ఒమేగా 3 లోపం ఉంటే గుండె సమస్యలు వస్తాయా..

ఇమ్యూనిటీ వ్యవస్థ, పల్మనరీ, కార్డియోవాస్కులర్, ఎండోక్రైన్ వ్యవస్థలు ఇవన్ని కూడా సరిగ్గా పనిచేసేందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఎన్నో విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు అవసరం. అయితే, వీటన్నింటిని మనం తీసుకునే ఆహారం ద్వారా పొందడం సాధ్యం కాదు. దీంతో శరీరానికి విటమిన్ల లోపం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో ఒకటే ఒమేగా 3 డెఫిషీయన్సీ.

​ఒమేగా 3 ఎందుకంత ముఖ్యం..

-3-

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తం గడ్డకట్టేందుకు, మీ రక్తాన్ని పంప్ చేసే ధమని గోడల సంకోచం, సడలింపు కోసం హార్మోన్లని సృష్టించడానికి బాడీకి అవసరం. ఒమేగా 3లో కనిపించే EPA, DHA మీ శరీరానికి, చర్మ ఆరోగ్యాన్ని, దృష్టికి కూడా సాయపడతాయి. అయితే, ఎప్పుడైతే బాడీలో ఒమేగా 3 లోపం తక్కువ అవుతుందో అప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

​కంటి సమస్యలు..​

​కంటి సమస్యలు..​

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. కళ్ళు డ్రైగా మారకుండా కన్నీటిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే కంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా మంది ఒమేగా 3 సప్లిమెంట్స్ కూడా ఇస్తారు. ఈ విటమిన్ లోపం ఉన్నప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, డ్రైగా మారడం జరుగుతుంది.

కళ్ళు డ్రైగా మారి ఇబ్బందిగా అనిపిస్తే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉందనుకోవచ్చు.

​కీళ్ళ నొప్పులు..

​కీళ్ళ నొప్పులు..

ఒమేగా 3 లోపం ఉంటే ఎక్కువగా జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి. అయితే ఇది కొన్ని సార్లు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటి వల్ల కూడా రావొచ్చు. సమస్య ఏంటనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఒమేగా 3 లోపం సరిగ్గా ఉంటే వారిని కీళ్ళనొప్పులు అంతగా ఇబ్బంది పెట్టవు.
Also Read : Breakfast For Diabetes : షుగర్ ఉన్నవారు ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే చాలా మంచిది

​స్కిన్ ప్రాబ్లమ్స్..

​స్కిన్ ప్రాబ్లమ్స్..

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ స్కిన్ ఆరోగ్యకరమైన పోషకాలను గ్రహించి హానికర వ్యర్థాలను వదిలించుకోవడానికి సాయపడతాయి. ఈ హెల్దీ ఫ్యాట్ లోపిస్తే చర్మం పొడిబారడంతో పాటు చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. దీంతో పాటు దురద, స్కిన్ పెచ్చుల్లా ఊడిపోవడం జరుగుతుంది.

ఇక గోర్ల సమస్యలు కూడా ఉంటాయి. గోర్లు డ్రైగా మారి విరిగిపోవడం ఈ విటమిన్ లోప లక్షణం అని చెప్పొచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స మీ నెయిల్స్‌కి చాలా ముఖ్యం.

​జుట్టు రాలడం..

​జుట్టు రాలడం..

జుట్టు అనేక కారణాలు రాలుతుంటుంది. అందులో ఒకటి ఒమేగా 3 లోపం. మీ జుట్టుకి బలాన్ని అందించడంలో ఒమేగా 3 చాలా అవసరం. ఈ పోషకాహార లోపం చర్మ, జుట్టు సమస్యలకి కారణమవుతుంది.

​అలసట..

​అలసట..

ప్రతి చిన్న విషయానికి అలసిపోతుంటే మీకు ఈ విటమిన్ లోపం ఉందని అనుకోవచ్చు. దీని వల్ల మీ ఏకాగ్రత ఉండదు. త్వరగా అలసిపోతుంటారు. అలాంటి సమయంలో మీకు ఈ లోపం ఉందేమో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

​గుండె ఆరోగ్యం..

​గుండె ఆరోగ్యం..

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీ గుండెకి చాలా మంచివి. నిపుణుల ప్రకారం, ఒమేగా 3 లేకపోవడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ బాడీలోని ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి.
Also Read : Unhealthy Gut : రెగ్యులర్‌గా ఆహారం జీర్ణమవ్వట్లేదా.. ఈ సమస్య ఉందేమో జాగ్రత్త..

​ఏ ఫుడ్ తినాలంటే..

​ఏ ఫుడ్ తినాలంటే..

శరీరం దానంతట అదే ఒమేగా 3ని తయారు చేయదు. అందుకే కొన్ని ఫుడ్స్‌ని తీసుకోవాలి. అందులో ఏమేం ఉన్నాయంటే..

వెజిటేబుల్ ఆయిల్స్
అవిసెలు
హెంప్ సీడ్స్
చియా సీడ్స్
బచ్చలి కూర
వాల్ నట్స్
సాల్మన్
సార్డినెస్
హెర్రిగ్ వంటి ఆయిలీ ఫిష్
వీటితో పాటు షెల్‌ఫిష్

​వీటితో పాటు..

​వీటితో పాటు..

అయితే మీకు లోపం ఎక్కువగా ఉంటే మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్స్ మీ పరిస్థితిని బట్టి ఒమేగా 3 సప్లిమెంట్స్‌ని కూడా సజెస్ట్ చేస్తారు. అందుకే, ఏదైనా సమస్యగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ని కలవడం ఉత్తమం.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu New

Latest news
Related news