బంగ్లాదేశ్ ( Bangladesh) టీమ్ సొంతగడ్డపై అలవోకగా వన్డే సిరీస్‌ని గెలిచేసింది. ఐర్లాండ్(Ireland)తో గురువారం జరిగిన మూడో వన్డేలో తొలుత బౌలింగ్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో సత్తాచాటిన బంగ్లాదేశ్ టీమ్ 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ని కూడా బంగ్లాదేశ్ 2-0తో చేజిక్కించుకోగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దయ్యిన విషయం తెలిసిందే.
మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టీమ్ 28.1 ఓవర్లలో 101 పరుగులకి ఆలౌటైంది. ఆ టీమ్‌లో కర్టీస్ క్యాంపర్ (36: 48 బంతుల్లో 4×4), టక్కర్ (28: 31 బంతుల్లో 4×4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగిలిన 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ 5 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ మూడు, ఎబాదత్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టారు.

102 పరుగుల లక్ష్యఛేదనని బంగ్లాదేశ్ టీమ్ 13.1 ఓవర్లలోనే ఛేదించేసింది. ఓపెనర్లు లిట్టన్ దాస్ (50 నాటౌట్: 38 బంతుల్లో 10×4), తమీమ్ ఇక్బాల్ (41 నాటౌట్: 41 బంతుల్లో 5×4, 2×6) మొదటి నుంచి దూకుడుగా ఆడేశారు. దాంతో తొలి వికెట్‌కి అజేయంగా 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడి.. బంగ్లాదేశ్‌కి విజయాన్ని అందించింది. ఇక సోమవారం నుంచి ఈ రెండు జట్ల మధ్య మూడు టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ జరగనుంది.
Read Latest Sports News, Cricket News, Telugu News