Thursday, June 1, 2023

Ajith Father demise: హీరో అజిత్ తండ్రి క‌న్నుమూత‌

Ajith Father: కోలీవుడ్ అగ్ర క‌థానాయకుల్లో ఒక‌రైన అజిత్ కుమార్ ఇంట విషాదం నెల‌కొంది. గ‌త కొన్ని రోజుల నుంచి అనారోగ్య కార‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న అజిత్ తండ్రి సుబ్ర‌మ‌ణ్యం శుక్ర‌వావారం క‌న్నుమూశారు. అభిమానులు, సినీ ప్ర‌ముఖులు అజిత్‌కి, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపాన్ని తెలియ‌చేస్తున్నారు. శుక్ర‌వారం సాయంత్రం చెన్నై బీసెంట్ న‌గ‌ర్‌లోని శ్మ‌శాన వాటిక‌లో అజిత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. సుబ్ర‌మ‌ణ్యం వ‌య‌సు 84 ఏళ్లు. వీరి స్వ‌స్థ‌లం కేర‌ళ‌లోని పాల‌క్కాడ్. ఈయ‌న‌కు ముగ్గురు పిల్ల‌లు. అజిత్ కుమార్‌, అనూప్ కుమార్‌, అనీల్ కుమార్‌. వీరు కొన్ని రోజులు సికింద్రాబాద్‌లో కూడా నివాసం ఉన్నారు. అజిత్ సైతం తెలుగు సినిమాల్లోనే ముందుగా నటించారు. ఆ త‌ర్వాతే త‌మిళ చిత్ర సీమ‌లోకి అడుగు పెట్టారు.

అజిత్, షామిలీ స‌హా కుటుంబ స‌భ్యులంద‌రూ ఇప్పుడు యూర‌ప్ టూర్‌లో ఉన్నారు. రీసెంట్‌గానే వారు త‌మ టూర్‌కి సంబంధించిన పొటోల‌ను నెట్టింట కూడా షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. తండ్రి మ‌ర‌ణ వార్త తెలియ‌గానే అజిత్ అండ్ ఫ్యామిలీ ఇండియాకు బ‌య‌లుదేరారు. ఈరోజు సాయంత్రం లోపు వారు ఇండియాకు చేరుకుంటార‌ని స‌మాచారం.

ALSO READ: Vishwak Sen: విల‌న్‌గా చేయ‌టానికి రెడీ అంటున్న విశ్వ‌క్ సేన్‌.. కానీ కండీష‌న్ అదే
ALSO READ: Prabhas: ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ టార్గెట్ చేసిన ప్ర‌భాస్‌.. పాట‌లు, కామెడీ లేకుండానే!

Latest news
Related news