Thursday, June 1, 2023

మీ లైఫ్‌లో ఈ చిన్న మార్పులు చేసుకుంటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..!

Heart Health: గుండె మన శరీరంలో ఎంత ముఖ్యమైన భాగమో మనందరికీ తెలిసు. ఇది మన శరీరం అంతటికీ రక్తనాన్ని సరఫరా చేస్తుంది. రక్తం ద్వారా బాడీ అంతా.. ఆక్సిజన్‌ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. గుండె హెల్త్‌ను కాపాడుకోవడానికి.. లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోమని కొందరు సలహా ఇస్తారు. ఇంకొందరు రెగ్యులర్‌గా ఎక్సఅర్‌సైజ్‌ చేసే హార్ట్‌ హెల్త్‌ బాగుంటుందని అంటారు. పోషకాహారం తీసుకుంటే.. గుండెను రక్షించుకోవచ్చని మరికొందరు చెబుతూ ఉంటారు. కొంతమందికి రోజూ వ్యాయామం చేయండి, పోషకాహారం తీసుకోవడం, లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇలా పెద్ద మార్పులతో కాకుండా.. చిన్నచిన్న మేకోవర్స్‌తో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మీ హార్ట్‌ హెల్త్‌కు మేలు చేసే సింపుల్‌ చిట్కాలు ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం.

మ్యూజిక్‌ వినండి..

మ్యూజిక్‌ వినండి..

రోజూ కేవలం 30 నిమిషాల పాటు మ్యూజిక్‌ వినడం వల్ల.. బీపీ కంట్రోల్‌లో ఉంటుందని, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని, హృదయ స్పందన రేటు తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితులు అన్నీ.. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. (image source – pixabay)

ఫిజికల్‌ టచ్‌..

ఫిజికల్‌ టచ్‌..

ఒక ఆత్మీయ స్పర్శ.. మనపై ప్రేమను చూపించడానికి, ప్రశంసలు ఇవ్వడానికి అద్భతుమైన మార్గం అని చెప్పొచ్చు. అంతే కాదు.. ఆత్మీయ స్పర్శ మానసిక, శరీరక ఆరోగ్యానికీ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక మనిషిని ఆత్మీయంగా కౌగిలించుకోవడం వల్ల.. కార్టిసాల్‌ స్థాయిలు (ఒత్తిడిని ప్రేరేపించే హార్మోన్) తగ్గడమే కాకుండా.. హృదయ స్పందన రేటు తగ్గుతుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

దయగా ఉండండి..

దయగా ఉండండి..

మీ రు నిస్వార్థంగా ఉన్నప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు.. ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్‌ రక్తపోటును తగ్గిస్తుంది, దీంతో గుండె ఆరోగ్యాంగా ఉంటుంది. కాబట్టు.. ఇతరుల పట్ల దయగా ఉండండి, సానుకూల దృక్పథాన్ని అలవరచుకోండి. (image source – pixabay)

మెడిటేరియన్‌ డైట్‌ తీసుకోండి..

మెడిటేరియన్‌ డైట్‌ తీసుకోండి..

మెడిటరేనియన్ డైట్ అనేది మొక్కల ఆధారిత ఆహారం. దీనిలో రకరకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, నట్స్‌, విత్తనాలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తింటారు. దీనిలో చక్కెర, ఎర్ర మాంసం, గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తులు చాలా తక్కువగా తీసుకుంటారు. దీనిలో శుద్ధి చేసిన నూనె, ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకోరు. ఈ ఆహారం గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఈ ఫుడ్‌ కాంబినేషన్‌ తింటే.. హెల్తీగా ఉంటారు..!

పండ్లు, కూరగాయలు తీసుకోండి..

పండ్లు, కూరగాయలు తీసుకోండి..

పండ్లు, కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.

Also Read: ఈ పండ్లు తొక్కలతో తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

రెస్ట్‌ తీసుకోండి..

రెస్ట్‌ తీసుకోండి..

మీ బిజీబిజీ లైఫ్‌స్టైల్‌ నుంచి కొంత రెస్ట్‌ తీసుకోండి. దీని కారణంగా ఒత్తిడి తగ్గుతుంది. ఇది మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పని నుంచి కొంత విరామం తీసుకుంటే.. గుండె సమస్యలు, ఊబకాయం, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు కూడా తగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. (image source – pixabay)

స్ట్రెచ్‌ చేయండి..

స్ట్రెచ్‌ చేయండి..

మీరు రోజూ వ్యాయామం చేయకపోయినా.. స్ట్రెచింగ్‌ చేయడం వల్ల, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. రోజూ స్టెచ్‌ చేసినవారి హైపర్‌టెన్షన్‌, మెరుగైన రక్త ప్రసరణ, ధమని దృఢత్వం తగ్గుతుందని, గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. (image source – pixabay)

Also Read: ఈ టైమ్‌లో వ్యాయామం చేస్తే.. త్వరగా బరువు తగ్గుతారు..!

సృజనాత్మకంగా ఆలోచించండి..

సృజనాత్మకంగా ఆలోచించండి..

మీ మనస్సుకు విశ్రాంతి ఇవ్వడానికి అల్లడం, కుట్టుపని, క్రోచింగ్‌ వంటి పనులు నేర్చుకోండి. ఇలా సృజనాత్మకంగా ఆలోచిస్తే.. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
మీ గుండెను హెల్తీగా ఉంచుకోవడానికి.. మీ లైప్‌లో ఈ చిన్నచిన్న మార్పులు చేసుకోండి. (Image source – pixabay)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news