Thursday, June 1, 2023

work from home, Job Frauds: వర్క్ ఫ్రమ్ హోం స్కామ్.. లక్షలు పోగొట్టుకుంటున్నారు జాగ్రత్త.. మీరు ఇలా చేస్తున్నారా? – beware of work from home scam, delhi man loses rs. 9 lakh to online job fraud


Job Frauds: గత కొంత కాలంగా సైబర్ ఫ్రాడ్స్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతా జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరం. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సరికొత్త సాంకేతికతతో కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లతో ముడిపడి ఉంటాయి గనుక ఏ కొంచెం నిర్లక్ష్యంగా బ్యాంక్ ఖాతా గుల్ల కావాల్సిందే. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు సైబర్ నిపుణులు. ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ బాగా పెరిగిపోయింది. చాలా మంది ఒకవైపు పూర్తి స్థాయి ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు అదనపు ఆదాయం కోసం వర్క్ ఫ్రమ్ హోం వంటివి చేసేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఎక్కడ కనిపించినా అప్లై చేయడం వంటివి చేస్తుంటారు. నిజమే కదా. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ఇప్పుడు దిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఇలాగే సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడ్డాడు. వర్క్ ఫ్రమ్ హోం జాబ్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు ఒక లింక్‌పై క్లిక్ చేశాడు. అంతే.. అతడి ఖాతాలో ఏకంగా రూ. 9 లక్షలకుపైగా ఖాళీ అయ్యాయి. అతడు కాస్త ఎక్కువ ఆదాయం కోసం అలా ప్రయత్నించినప్పటికీ.. ఉన్నవంతా పోగొట్టుకున్నాడు. ANI Report ప్రకారం.. బాధితుడు దిల్లీ పీతంపురా ప్రాంతానికి చెందిన హరిన్ బన్సాల్. రోజూ ఎక్కువ సంపాదించుకునే సదుపాయంతో వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవచ్చని ఉన్న ఒక ప్రకటనను సోషల్ మీడియాలో చూసిన బన్సాల్.. ఆ పోస్ట్‌పై క్లిక్ చేశాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్ చాట్ ఓపెన్ అయింది. అక్కడ ఒక లింక్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించగా వారి ఉచ్చులో చిక్కాడు. అప్పుడు సదరు అకౌంట్ నంబర్‌కు కొంత మొత్తంలో నగదు డిపాజిట్ చేసి తర్వాత విత్‌డ్రా చేస్తే కమిషన్ కూడా వస్తుందని నమ్మబలికారు. ఇలా మొత్తంగా రూ.9,32,000 మోసపోయాడు.

అందుకే ఆన్‌లైన్‌లో ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా అప్లై చేసే ముందు.. సోర్స్ ధ్రువీకరించుకోవడం ముఖ్యమని చెబుతున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్స్. వర్క్ ఫ్రమ్ హోం కోసం అంతా ఎదురుచూస్తున్నారు కాబట్టే.. దీనినే తమకు అనుకూలంగా మలచుకొని ఎందరో సైబర్ నేరాలకు పాల్పడేందుకు కొత్త కొత్తగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మనం ఊహించని విధంగా కూడా డబ్బులు పోయే ప్రమాదం ఉందని, అందుకే కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా.. ఆన్‌లైన్‌లో ఏది శోధించినా, అప్లై చేసినా.. అన్నింటి పట్ల ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయాలని సూచిస్తున్నారు.

బన్సాల్ అనే కాదు.. చదువుకోని వారు ఇలాంటి మోసాలతో పెద్ద మొత్తంలో కోల్పోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మొన్నటికి మొన్న గూగుల్ పే, ఫోన్ పే వాడే వారిలో చాలా మందిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఎలాంటి ఫ్రాడ్స్ చేస్తున్నారో ఇటీవల కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వార్త కోసం ఇక్కడ కింద చూడండి.

Phone Pe, Google Pay వాడుతున్నారా? 81 మంది దగ్గర రూ. కోటి లాగారు.. సరికొత్త మోసం.. ఇలా చేయకండి!

SBI: అదే జరిగింది.. ఛార్జీలు పెంచేసిన ఎస్‌బీఐ.. కస్టమర్లకు పెద్ద దెబ్బ.. కొత్త రేట్లు ఇవే..Google Layoffs: తొలగించిన గూగుల్ ఉద్యోగులకు మరో పెద్ద దెబ్బ.. కఠిన నిర్ణయం.. ఆ డబ్బులేం రావట!



Source link

Latest news
Related news