Tuesday, March 21, 2023

tax benefits, SBIలో పెన్షన్ అకౌంట్ NPS తీసుకుంటే ‘ట్యాక్స్ బెనిఫిట్స్’ ఎలా ఉంటాయి? – sbi nps what are tax benefits in pension account of nps at sbi


SBI NPS Account: పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడంలో జాతీయ పింఛను పథకం ఎంతగానో తోడ్పడుతోంది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా తమ కస్టమర్లు ట్యాక్స్ సేవింగ్స్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌పీఎస్ అనేది వాలంటరీ రిటైర్‌మెంట్ సేవింగ్స్ స్కీమ్. పదవీ విరమణ తర్వాత పెన్షన్ రూపంలో వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్‌ నిర్వహణ, నియంత్రణ అనేవి పీఎఫ్ఆర్‌డీఏ చూస్తుంది. ఈ స్కీమ్ ప్రపంచంలోనే అంత్యంత తక్కువ ఖర్చుతో పెన్షన్ అందిస్తున్న స్కీమ్‌గా నిలుస్తోంది. సబ్‌స్క్రైబర్స్ తమ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు, పెన్షన్ ఫండ్ వంటివి స్వయంగా ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రకాల నేషనల్ పెన్షన్ స్కీమ్స్ (sbi nps account) అందిస్తోంది. అందులో ఒకటి టైర్ 1 ఇది పెన్షన్ అకౌంట్ దీనిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది టైర్ 2 అకౌంట్. ఇది ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్, ఇది ఆప్షనల్. టైర్ 1 ఖాతా తీసుకునేందుకు కనీసం రూ.500 గా ఉండగా టైర్ 2 అకౌంట్ తీసుకునేందుకు కనీసం రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, టైర్ 1 అకౌంట్‌పై ట్యాక్స్ బెనిఫిట్స్ అందుబాటులో ఉండగా.. టైర్ 2 ఖాతాలపై అలాంటి పన్ను రాయితీలు ఉండవు. కానీ, ఏ సమయంలోనైనా ఖాతా నిధి నుంచి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

రెసిడెంట్ ఇండియన్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్‌తో పాటు భారత పౌరులందరూ 18 నుంచి 70 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు ఎస్‌బీలో జాతీయ పింఛను పథకంలో అకౌంట్ (sbi nps calculator) ఓపెన్ చేయవచ్చు. టైర్-1ఖాతా తీసుకున్న ఉద్యోగులకు వారు జమ చేసే మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద పన్ను బెనిఫిట్స్ అందుతాయి. సుమారు రూ.50 వేల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగం 80సీసీఈ ప్రకారం రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై (10 శాతం బేసిక్ శాలరీ, డీఏ) ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. మరోవైపు.. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ విషయంలో శాలరీపై (బేసిక్ శాలరీ ప్లస్ డీఏ)పై 10 శాతం ఆదాయపు పన్ను చట్టం 80సీసీడీ(2) కింద ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. మానిటరీ సీలింగ్ రూ.7.5 లక్షల వరకు ఇది లభిస్తుంది.

60 ఏళ్లు వచ్చిన తర్వాత టైర్-1 అకౌంట్ ఎగ్జిట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి?
ఖాతాదారుడు 60 ఏళ్లు వచ్చిన త్రవాత టైర్-1 అకౌంట్ ను ఎగ్జిట్ ఆప్షన్ ఎంచుకోవాలంటే అందులో కనీసం 40 శాతం కార్పస్ నిధిని యాన్యూటీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం కార్పస్ పెద్ద మొత్తంలో 75 ఏళ్ల వరకు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. ఈ డబ్బులపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. మొత్తం నిధి రూ.5 లక్షలు, ఆలోపే ఉంటే మొత్తం ఒకేసారి తీసుకోవచ్చు. మరోవైపు.. అకౌంట్ తీసుకున్న 5 ఏళ్ల తర్వాత టైర్-1 ఎగ్జిట్ ఆప్షన్ ఎంచుకోవాలంటే 20 శాతం కార్పస్ నిధిని విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 80 శాతం ఫండ్‌ని యూన్యూటీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. రూ.2.50 లక్షల వరకు తీసుకోవచ్చు. మరోవైపు.. మూడేళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత ఉద్యోగి చెల్లించే కాంట్రిబ్యూషన్‌లో నుంచి 25 శాతానికి మించకుండా విత్ డ్రా చేసుకునే అవకాశాలు ఉంటుంది.

SSY: ఆ స్కీమ్‌ డిపాజిటర్లకు కేంద్రం ఝలక్.. వడ్డీ రేట్ల పెంపు లేనట్లే?SBI కొత్త పథకం.. ఇతర డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ.. తక్కువ కాలంలోనే ఎక్కువ లాభం..EPFO: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. అధిక పెన్షన్‌ కోసం గడువు పెంపు!



Source link

Latest news
Related news