శనివారం నాడు ఇదే విషయంపై సజ్జల మాట్లాడారు. పట్టభద్రుల విషయంలో క్షేత్ర స్థాయిలోకి తమ మెసేజ్ తీసుకెళ్లడం, ఆ ప్రత్యేక ఓటర్లను రీచ్ కావడంలో కొంత ఇబ్బంది జరిగినట్టు ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు మొత్తం సమాజాన్ని ప్రతిబింబిస్తాయి అని తాము అనుకోవడం లేదని… అలా అని దీన్ని తగ్గించాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత గేర్ అప్ అవుతామని… ఈసారి కమ్యూనిస్టు పార్టీలతో ఎక్కువగా ఉండే పీడీఎఫ్ లాంటి వేదికలు తెలుగుదేశం పార్టీకి ఓట్లను బదిలీ చేశాయని చెప్పారు. వచ్చినవన్నీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కావు అని…వారి అభ్యర్థులు కూడా ఎవరికీ పెద్దగా తెలియదని చెప్పారు. వాళ్ల మధ్య ఉన్న అవగాహన వల్ల అన్ని శక్తులు ఏకమవ్వడంవల్ల తెలుగుదేశం పార్టీ లాభపడి ఉంటుందన్నారు.
BREAKING NEWS