వైజాగ్ వన్డేలో భారత్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘మ్యాచ్‌లో తగినంత స్కోరుని బోర్డుపై
ఉంచలేకపోయాం. వరుసగా వికెట్లు చేజార్చుకోవడం దానికి ప్రధాన కారణం. ఫస్ట్‌లోనే శుభమన్ గిల్ వికెట్ చేజారిన తర్వాత నేను, కోహ్లీ 30-35 పరుగుల్ని వేగంగా చేశాం. కానీ.. ఆ తర్వాత నేను వికెట్ చేజార్చుకున్నా.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోయాం. దాంతో టీమ్ వెనకడుగు వేసి.. మళ్లీ పుంజుకోలేకపోయింది. 117 పరుగులు మాత్రమే చేసే పిచ్ కాదు ఇది.. కానీ మేము తగినంత స్కోరు చేయలేకపోయాం’’ అని చెప్పుకొచ్చాడు.
వైజాగ్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్నట్లు కనిపించింది. కానీ.. ఎక్స్‌ట్రా బౌన్స్ టీమిండియాని దెబ్బతీసింది. ఆసీస్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బంతిని స్వింగ్ చేస్తూ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటర్లు తడబడిన ఇదే పిచ్‌పై ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్ (66 నాటౌట్: 36 బంతుల్లో 6×4, 6×6), ట్రావిస్ హెడ్ (51 నాటౌట్: 30 బంతుల్లో 10×4) అలవోకగా షాట్స్ ఆడేశారు.
Read Latest Sports News, Cricket News, Telugu News