Thursday, June 1, 2023

Priyadarshi: రామ్ చరణ్ ఇప్పటికీ శంకర్ ముందు చేతులు కట్టుకుంటారు: ప్రియదర్శి

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి (Priyadarshi).. ఓవైపు స్టార్ హీరోల చిత్రాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూనే అప్పుడప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాల్లో లీడ్ క్యారెక్టర్స్‌ చేస్తున్నాడు. ఈ విధంగా తనలోని నటుడిని ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తున్నాడు. ఇక ఇటీవలే ‘బలగం’ (Balagam) చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రియదర్శి.. తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌ (Ram Charan) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రియదర్శి తన కెరీర్‌లో మొదటిసారిగా RC15 చిత్రంలో చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతుండగా.. సెట్‌లో రామ్ చరణ్ ఎలా ఉంటారో ఈ సందర్భంగా తెలిపాడు దర్శి.

రామ్ చరణ్‌ను చూస్తుంటే.. హాఫ్ చిరంజీవిని చూస్తున్నట్లే ఉంటుందన్నాడు దర్శి. సెట్‌లో బెస్ట్ మూమెంట్ అంటే.. ఆయనతో కలిసి లంచ్ చేయడమేనని వెల్లడించాడు. తనతో పాటు సత్య, వెంకీ, చైతన్య, రామన్న.. అందరం కలిసి భోజనం చేస్తామన్నాడు. రామన్న అంత సింపుల్‌గా ఉంటాడని తెలిపాడు. ఒక్కోసారి తనను RC15 సెట్‌లో చూస్తుంటే.. RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేసింది తనేనా? అనిపిస్తుందని గుర్తుచేసుకున్నాడు. అదే విషయాన్ని రామన్నను అడిగినపుడు.. ‘ఏం లేదు. రాజమౌళి గారు చెప్తుంటే నేను చేసేవాడిని’ అంటూ సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చేవాడని పేర్కొన్నాడు.

రామ్ చరణ్‌ను సంస్కారాన్ని, సింప్లిసిటీని చూస్తుంటే.. గొప్ప పెంపకం అనిపిస్తుందని షేర్ చేసుకున్నాడు దర్శి. ఇక షాట్ చేయాలంటే మాత్రం ఒక్కసారిగా అలర్ట్ అయిపోతారని అన్నాడు. ఇప్పటికి కూడా RC15 సెట్‌లో శంకర్ సర్ వచ్చారంటే.. రామన్న చేతులు కట్టుకుని ఆయన చెప్పేది శ్రద్ధగా విని ‘రెడీ సర్’ అంటారని, ఇలాంటి గొప్ప లక్షణాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే, RC15 షూటింగ్ తుది దశకు చేరుకుంది. కియారా అద్వానీ ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. కాగా చరణ్ బర్త్‌డే రోజునన ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తారని సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయనున్నాడని తెలిసిందే. ఇదిలా ఉంటే.. RRR మూవీ తర్వాత లభించిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ దృష్ట్యా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇక రామ్ చరణ్ దంపతులు త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఆయన భార్య ఉపాసన ప్రస్తుతం 5 నెలల గర్భంతో ఉంది. కాగా.. ఆమె డెలివరీర ఇండియాలోనే అపోలో హాస్పిటల్స్‌లో ప్లాన్ చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest news
Related news