Thursday, June 1, 2023

kotak mahindra bank, FD Rates: మీ డబ్బులకు ఎక్కువ వడ్డీ కావాలా? ఇగో ఈ బ్యాంకు రేట్లు పెంచింది.. త్వరపడండి! – kotak mahindra bank latest fd rates are effective from march 20 2023


FD Rates: బ్యాంకులో డబ్బులు దాచుకుని ఆదాయం పొందాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్త. ప్రముఖ ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ.2 కోట్లు లోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల మధ్య టెన్యూర్ కలిగిని ఎఫ్‌డీలపై (Fixed Deposits Rates) సాధారణ డిపాజిటర్లకు 2.75 శాతం నుంచి 6.20 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.25 నుంచి 6.70 వరకు వడ్డీ ఇస్తోంది. నాన్ సీనియర్ సిజిటన్లకు ప్రత్యేకంగా 390 రోజుల నుంచి రెండేళ్లలోపు మెచ్యూరిటీ కలిగిన డిపాజిట్లపై గరిష్ఠంగా 7.20 శాతం మేర వడ్డీ ఇస్తోంది. సీనియర్లకు ఇదే టెన్యూర్‌పై 7.70 శాతం వడ్డీ ఇస్తోంది. పెంచిన వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అంటే మార్చి 20,2023 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు..
డిపాజిట్లు 7 రోజుల నుంచి 14 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటే వాటిపై 2.75 శాతం వడ్డీ ఇస్తోంది కోటక్ మహీంద్రా బ్యాంక్. అలేగా 15 రోజుల నుంచి 30 రోజులకు 3 శాతం, 31 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లకు 3.25 శాతం, 46 రోజుల నుంచి 90 రోజుల మెచ్యూరిటీకి 3.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అలాగే 91 రోజుల నుంచి 120 రోజుల టెన్యూర్ డిపాజిట్లకు 4 శాతం, 121 రోజుల నుంచి 179 రోజులకు 4.25 శాతం వడ్డీ ఇస్తోంది. 180 రోజుల టెన్యూర్ డిపాజిట్లకు 6.50 శాతం వడ్డీ ఇస్తోంది. 181 రోజుల నుంచి 363 రోజలకు సైతం 6.50 శాతం, అలాగే 364 రోజులు అంతకన్నా తక్కువుంటే 6.25 శాతం వడ్డీ ఇస్తోంది. 365 రోజుల నుంచి 389 రోజుల ఉన్నట్లయితే 7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 390 రోజుల నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై 7.20 శాతం, రెండేళ్ల నుంచి 3 ఏళ్లలోపు డిపాజిట్లకు 7 శాతం వడ్డీ ఇస్తోంది. అలాగే మూడేళ్ల నుంచి నాలుగేళ్లలోపు డిపాజిట్లకు 6.50 శాతం, నాలుగేళ్లపైన ఉండి 5 ఏళ్లలోపు ఉండే టెన్యూర్లపై 6.25 శాతం వడ్డీ ఇస్తోంది. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు డిపాజిట్లపై 6.20 శాతం వడ్డీ ఇస్తోంది.

కనీసం డిపాజిట్ ఎంత..
కోటక్ మహీంద్రా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరవాలంటే కనీసం రూ.5000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కోటక్ మహీంద్రాలో ఎఫ్‌డీ ఖాతా ఉంటే క్యూమిలేటివ్, నెలవారీ, త్రైమసిక వడ్డీ పేమెంట్స్ అవకాశం సైతం ఉంది. ఈ సదుపాయాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని బ్యాంకు కోరుతోంది. మరోవైపు.. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన క్రమంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అదే సమయంలో డిపాజిట్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీలను ఆఫర్ చేస్తున్నాయి.

FD Rates: ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. డబ్బులుంటే అధిక వడ్డీ.. SBI కన్నా ఎక్కువే..!FD Rates: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రముఖ బ్యాంక్.. వడ్డీ రేట్ల పెంపు.. డబ్బులుంటే అధిక ఆదాయం!FD Rates: ప్రభుత్వ బ్యాంక్ కీలక ప్రకటన.. నేటి నుంచే అమలు.. మీ డబ్బులకు అధిక వడ్డీ పక్కా!



Source link

Latest news
Related news