ఫోన్ వేగం తగ్గిపోయే అవకాశం ఉంది..

మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను అందిస్తుంటాయి. ఇవి మొబైల్ పని తీరును మెరుగుపరచడం సహా ఫోన్ ఎక్కువ కాలం పని చేసేందుకు ఉపయోగపడతాయి. కొన్ని సార్లు మన ఫోన్ స్ట్రక్ అయిపోవడం, స్లోగా పని చేయడం గమనించే ఉంటాం. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. మళ్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్లీ పని చేస్తుంటుంది. సాఫ్ట్ వేర్ అప్‌డేట్ వచ్చినప్పుడు అప్‌డేట్ చేసుకోక పోవడం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంటుంది.
కొత్త ఫీచర్లు కోల్పోయే అవకాశం..

ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపటి రోజున మారిపోతున్న సమయం ఇది. రోజులు మారుతున్న కొద్దీ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వీటికి అనుగునంగానే మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తమ యూజర్లకు అందిస్తుంటాయి. పాత వాటిలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసి మెరుగులు దిద్దుతుంటాయి. ఇందులో కొన్ని సెక్యూరిటీలకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. ఈ కొత్త ఫీచర్లు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేందుకు ఫోన్‌కు వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. కొత్త ఫీచర్లను ఎంజాయ్ చేస్తూ ఉండాలి.
బ్యాటరీ లైఫ్ మెరుగవుతుంది..

మొబైల్ తయారీ సంస్థలు విడుదల చేసే కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో కెమెరా పని తీరును మరితం మెరుగుపరచడం సహా బ్యాటరీ లైఫ్‌నూ పెంచే అప్‌డేట్స్ అందిస్తుంటాయి. బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించే విధంగా సాఫ్‌వేర్ అప్‌డేట్‌ను అందిస్తుంటాయి మొబైల్ కంపెనీలు. చాలా మంది ఇష్ట వచ్చిన యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తుంటారు. వాటి ద్వారా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది. అవి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంటాయి. ఒక వేళ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోకపోతే బ్యాటరీ పని తీరుపై ప్రభావం పడి దాని లైఫ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
హ్యాకింగ్ నుంచి రక్షణ లభిస్తుంది..

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా అదే స్థాయిలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సెక్యూరిటీ అప్‌డేట్ అనేది మొబైల్ ఫోన్‌పై జరిగే సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంటుంది. మన ఫోన్లలో ఉండే బగ్స్ కారణంగా ఒక్కసారి సైబర్ నేరగాళ్లు ఈజీగా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. ఒక వేళ స్మార్ట్ వేర్ అప్డేట్ చేయకపోతే మాల్ వేర్‌ను మన ఫోన్‌లో ఎక్కించి విలువైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించే అవకాశం ఉంటుంది. ఇలాంటివి వాటిని ఎదుర్కొనేందుకు మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్ చేస్తుంటాయి. దీని వల్ల ఇంటర్ ఫేస్‌లో మార్పులు ఉండవు. కాబట్టి వచ్చేటి అప్డేట్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
సురక్షితమైన వైఫై ద్వారా అప్‌డేట్ చేసుకోవడం మేలు..

మీ మొబైల్ ఫోన్ అప్డేట్ చేసుకోవాలని భావించిన క్రమంలో ముందుగా మీరు స్థిరమైన, సురక్షితమైన వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకోవలి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసేందుకు పెద్ద మొత్తం డేటా అవసరం అవుతుంది. తరుచూ ఎక్కువ మొత్తంలో డేటా ఖర్చు చేస్తూ అప్డేట్ చేయడం కుదరదు. ఇది మీ రోజువారీ డేటా మొత్తాన్ని తినేస్తుంది. అందుకే మీ ఫోన్‌ను మంచి వర్కింగ్ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకుని అప్డేట్ చేసుకోవాలి. మరోవైపు.. అప్డేట్ చేసేముందే మీడేటాను బ్యాకప్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కోసారి మీ ఫోన్ రీసెట్టింగ్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు మీ విలువైన సమచారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.