Friday, March 31, 2023

indusind bank rates, FD Rates: ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. డబ్బులుంటే అధిక వడ్డీ.. SBI కన్నా ఎక్కువే..! – fd rates indusind bank hikes fd rates by up to 50 bps offers up to 8 25 percent


FD Rates: దేశీయా దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. రూ.2 కోట్లు లోపు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా సవరణతో ఈ బ్యాంకులో డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7 శాతం వరకు సాధారణ ప్రజలకు 4 శాతం నుంచి 7.50 శాతం వరకు సీనియటర్ సిటిజన్లకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. అలాగే ఏడాది, ఆరు నెలల నుంచి మూడు ఏళ్ల మూడు నెలల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 7.75 శాతం, సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.25 శాతం మేర వడ్డీ అందిస్తోంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం మార్చి 18, 2023 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి.

ఇండస్ ఇండ్ బ్యాంక్ వడ్డీ రేట్లు..
డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లు (fd rates in india) రూ.2 కోట్లు లోపు ఉన్నట్లయితే 7 రోజుల నుంచి 30 రోజుల వరకు 3.50 శాతం వడ్డీ ఇస్తోంది. అలాగే 31 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై 4 శాతం, 46 రోజుల నుంచి 60 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 4.50 శాతం వడ్డీ కల్పిస్తోంది ఇండస్ ఇండ్ బ్యాంక్. అలాగే 61 రోజుల నుంచి 90 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 4.60 శాతం వడ్డీ ఇస్తోంది. 91 రోజుల నుంచి 120 రోజులకు 4.75 శాతం, 121 రోజుల నుంచి 180 రోజుల టెన్యూర్లకు 5 శాతం, 181 రోజుల నుంచి 210 రోజుల వరకు 5.75 శాతం, 211 రోజుల నుంచి 269 రోజుల డిపాజిట్లకు 5.80 శాతం 270 రోజుల నుంచి 254 రోజుల మెచ్యూరిటీ ఎఫ్‌డీలకు 6 శాతం, 355 రోజుల నుంచి 364 రోజుల మధ్య టెన్యూర్ డిపాజిట్లకు 6.5 శాతం వడ్డీ అందిస్తోంది ఇండస్ ఇండ్ బ్యాంక్.

50 బేసిస్ పాయింట్లు పెంపు..
ఇండస్ ఇండ్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు పెంచింది. ఏడాది నుంచి 18 నెలల్లోపు టెన్యూర్ కలిగిన డిపాజిట్లపై 7 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది. ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు టెన్యూర్ డిపాజిట్లపై 7.25 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది బ్యాంక్. అలాగే రెండేళ్ల నుంచి మూడేళ్ల మూడు నెలల టెన్యూర్ కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతానికి చేర్చింది. అలాగే మూడు ఏళ్ల మూడు నెలల నుంచి 61 నెలలోపు ఉన్న డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. 61 నెలలుపైబడి డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ ఇస్తోంది.

మరోవైపు.. 60 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల చేసే టర్మ్ డిపాజిట్లు రూ.2 కోట్ల లోపు ఉన్నట్లియితే వారి అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు కల్పిస్తోంది ఇండస్ ఇండ్ బ్యాంక్.

FD Rates: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రముఖ బ్యాంక్.. వడ్డీ రేట్ల పెంపు.. డబ్బులుంటే అధిక ఆదాయం!FD Rates: ప్రభుత్వ బ్యాంక్ కీలక ప్రకటన.. నేటి నుంచే అమలు.. మీ డబ్బులకు అధిక వడ్డీ పక్కా!DCB Bank: బ్యాంకు కీలక ప్రకటన.. ఒకటి కాదు ఒకేసారి రెండు శుభవార్తలు.. ఏం నిర్ణయం తీసుకుందంటే?



Source link

Latest news
Related news