Thursday, March 30, 2023

hindenburg row, Adani: అదానీ మరో కీలక నిర్ణయం.. రూ.35 వేల కోట్ల ప్రాజెక్టుకు బ్రేకులు.. అందుకోసమేనటా! – hindenburg row adani group suspends work on rs 34900 crore petrochemical project in gujarat


Adani Group: అదానీ గ్రూప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్లోని ముంద్రాలో చేపట్టిన రూ.34,900 కోట్లు విలువైన పెట్రో కెమికల్ ప్రాజెక్టును (Mundra Petrochemical Project) నిలిపివేసింది. అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదికతో కోల్పోయిన విశ్వాసాన్ని ఇన్వెస్టర్లలో నింపేందుకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని భావిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సంబంధిత వర్గాలు తెలిపాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో (Adani Hindenburg Row) అదానీ గ్రూప్ పతనమైన తర్వాత తిరిగి గాడినపెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani). ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడమూ ఆ ప్రణాళికలో భాగమేనని తెలుస్తోంది.

అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ 2021లో ఈ ముంద్రా పెట్రో కెమికల్ ప్రాజెక్టును చేపట్టింది. గుజరాత్ కచ్ జిల్లాలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషన్ ఎకనామిక్ జోన్‌లో ఉన్న పీవీసీ ప్లాంట్‌కు గ్రీన్‌ఫీల్డ్ కోల్ అందించేందుకు దీనిని చేపట్టింది. కానీ, జనవరి 24న అదానీ గ్రూప్‌లో అవకతవకలు, స్టాక్ మానిప్యూలేషన్ వంటి ఇతర ఆరోపణలతో హిండెన్‌బర్గ్ నివేదిక భయటకు వచ్చిన తర్వాత అంతా తారుమారైంది. ఈ రిపోర్ట్‌తో గౌతమ్ అదానీ సామ్రాజ్యం సుమారు 140 బిలియన్ డాలర్లు మేర మార్కెట్ విలువను కోల్పోయింది. ఆ తర్వాత తిరిగి గాడిన పడేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది అదానీ గ్రూప్. బ్లాక్ డీల్స్, ముందస్తు అప్పుల చెల్లింపు, విదేశాల్లో ప్రదర్శనలు వంటివి చేస్తోంది.

హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. క్యాష్ ఫ్లో, అందుబాటులో ఉన్న ఫైనాన్ష్‌ను బట్టి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఏడాదికి 1 మిలియన్ టన్నుల గ్రీన్ పీవీసీ ప్రాజెక్టును కొద్ది రోజులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఈ విషయానికి సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. తక్షణే అన్ని కార్యకలాపాలను సస్పెండ్ చేస్తున్నట్లు సరఫరాదారులు, వెండర్స్‌కి మెయిల్స్ సైతం పంపించినట్లు చెప్పారు. ఆ మెయిల్స్ ద్వారా ముంద్రా పెట్రో కెమికల్స్ లిమిటెడ్ గ్రీన్ పీవీసీ ప్రాజెక్ట్ కోసం తదుపరి నోటీసులు వచ్చే వరకు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని వారిని కోరినట్లు పేర్కొన్నారు. మరోవైపు.. పలు కంపెనీ ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నామని, కొన్నింటిని కొనసాగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. హిండెన్‌బర్గ్ ఆరోపణల నుంచి ఇప్పుడిప్పుడే కంపెనీ షేర్లు కోలుకుంటున్నాయి. పలు కంపెనీలు గడిచిన వారం 10 రోజుల్లో భారీగా పుంజుకున్నాయి. గౌతమ్ అదానీ ప్రణాళికలు పని చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆయన మళ్లీ కుబేరుల జాబితాలో దూసుకొస్తున్నారు.

Adani: ఎట్టకేలకు అంగీకరించిన అదానీ.. మరి ‘హిండెన్‌బర్గ్’ ఆరోపణలు నిజమేనా?Adani: పార్లమెంట్ సాక్షిగా ‘అదానీ’ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన..!Adani: అదానీ ఇంట పెళ్లి సందడి.. చిన్న కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?



Source link

Latest news
Related news