అందుకే మహానటి
“ఈ సినిమా కోసం చలిలో అయితే మా బంగారుతల్లి మా చెల్లెలు కీర్తి సురేశ్ ఇట్ల వణికిపోయి మరీ చేసింది. మా చెల్లెలికి మా బంగారు తల్లికి.. నీ కాళ్లు ఎన్నిసార్లు మొక్కినా తక్కువేరా.. నిజంగా చెప్తున్నా.. నువ్వు మామూలు మనిషివి కాదు.. తెలుసా? అంటే నేను మామూలుగా చెల్లె అనే అంటా. చెల్లె.. ఎంతమందితో నేను వర్క్ చేసినా కానీ.. మాతో పాటు భూమ్మీద కూర్చున్న ఏ హీరోయిన్ లేదు. చెల్లె.. నువ్వు అందుకే మహానటి. నిజంగా తెలుసా.. ఫ్రెండ్స్ అందరం మేము ఎక్కడ కూర్చుంటే.. ‘ఏరి ఫ్రెండ్స్ ఏరి’ అని వెతుక్కుంటూ వచ్చి.. మేము గుడిసెలల్లో కూర్చుంటిమి ఎండకు.. ఆ గుడిసెల్లోకి వచ్చి పలకరించి, కూర్చొని ముచ్చటపెట్టి పోయే తల్లివి నువ్వు.”
– కొమరం
చీరను దూరం పెట్టి
జబర్దస్త్ కమెడియన్‌గా ఎప్పుడూ లేడీ గెటప్‌లలో కనిపించేవాడు కొమరం. అందుకే అందరూ కొమరక్క అని పిలుస్తుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం కొమరంగా నటించాడు.
“నా చీరను దూరం పెట్టి నన్ను ఇలా చూపీయాలని ఓ సాహసం చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ అన్న. తెలుగు ప్రేక్షకులకు కొమరక్కగా నేను అందరికీ తెలుసు. కొమరంగా కూడా మీరు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. నాని అన్నతో ఇది రెండో సినిమా. జెర్సీలో నాని అన్న ఫ్రెండ్‌గా చేశాను. కానీ ఇందులో ఇంత బాగా నాతో ఫైట్లు, డ్యాన్స్‌లు చేయించిన శ్రీకాంత్ అన్నకు థాంక్స్. ఈ సినిమా గురించి మేము ఎంత చెప్పినా తక్కువే. కానీ సినిమా రిలీజ్ అయిన మార్చి 30 తర్వాత మీరే వందసార్లు ఫోన్ చేసి ఈ సినిమా గురించి మాకు చెబుతారు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డామంటే వానకాలం చూశాం, ఎండాకాలం చూశాం, చలికాలం చూశాం. మేము చూడని కాలం లేదు. అన్ని కాలల్లో షూటింగ్ చేశాం. నాని అన్న అయితే ఆ చిన్న స్మయిల్. ఏ హీరోతో చేసినా ఆ చిన్న డిస్టెన్స్ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ నాని అన్నతో అది ఉండదు. మా అన్నే కదా అన్నట్లు ఉంటది.”
– కొమరం
తొలిసారి
తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ‘దసరా’ సినిమాలో డీ-గ్లామర్ రోల్‌లో నాని కనిపించాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లో ధరణి (నాని) పాత్ర నిజంగా విశ్వరూపం చూపించింది. ఎందుకంటే ఊర మాస్ అవతారంలో నాని పెర్ఫామెన్స్ ఇరగదీశాడు. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెంటుకున్నారు ఫ్యాన్స్.
- Read latest TV News and Movie Updates