రాష్ట్రంలో జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సీట్లను తన ఖాతాలో వేసుకుంది టీడీపీ. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విక్టరీ కొట్టింది. ఉత్తరాంధ్రకు సంంబధించి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో గెలుపొందారు. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి చిరంజీవిరావుకు 82,958 ఓట్లు పోలయ్యాయి. ఇక వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు వచ్చాయి. ఇక గతంలో ఇదే సీటు నుంచి గెలిచిన బీజేపీ పీవీఎన్ మాధవ్‌కు కేవలం 10,884 ఓట్లు పోలయ్యాయి. చిరంజీవిరావు విజయం సాధించేందుకు ఇంకా 11,551 ఓట్లు కావాల్సి ఉండటంతో అధికారులు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా.. విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం అత్యంత ఆసక్తిని రేపింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయసాధించారు. ఇక్కడ కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మెజారిటీ సాధించారు.
BREAKING NEWS