ముందే తరగతులను ప్రారంభించడం వల్ల విద్యార్థులు ఇతర లైఫ్ స్కిల్స్ ను నేర్చుకునే అవకాశం లభించదని సీబీఎస్సీ (CBSE) పేర్కొంది. అకడమిక్స్ తో పాటు ఆరోగ్యం, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్ వంటివి కూడా విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధికి అత్యంత అవసరమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సీబీఎస్ఈ (CBSE) గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలు కచ్చితంగా సీబీఎస్ఈ (CBSE) నిబంధనావళిని పాటించాని, ఈ విషయాన్ని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు గుర్తించాలని స్పష్టం చేసింది.