మ్యాచ్‌లో టాస్ గెలిచిన లాహోర్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆ జట్టులో షఫీక్ (65: 40 బంతుల్లో 8×4, 2×6) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. ఓపెనర్లు మీర్జా (30), ఫకార్ జమాన్ (39: 34 బంతుల్లో 4×4, 1×6) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో షాహిన్ షా అఫ్రిది దూకుడుగా ఆడటం లాహోర్ టీమ్‌కి కలిసొచ్చింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన ఇసానుల్లా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సమర్పించుకోవడంతో పాటు ఐదు వైడ్స్ వేశాడు. దాంతో ఓవరాల్‌గా ఆ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లోనే షాహిన్ షా అఫ్రిది రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టడం విశేషం. అలానే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ చివరి బంతిని కూడా అఫ్రిది సిక్స్‌గా మలిచాడు.
Read Latest Sports News, Cricket News, Telugu News