మొత్తంగా 16,160 మంది
SSC CHSL 2021 Results: టైపింగ్ టెస్టులో 14,873 మంది అర్హత సాధించారు. వీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‍కు హాజరుకావాల్సి ఉంటుంది. మొత్తంగా టైపింగ్ టెస్టుకు 35,023 మంది హాజరుకాగా, 14,873 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్ట్ అయ్యారని ఎస్ఎస్‍సీ వెల్లడించింది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల పేర్లతో పూర్తి జాబితాను విడుదల చేసింది. ఇక DEST టెస్టులో 220 మంది, DEST (సీఏజీ మినహా) టెస్టులో 1067 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్‍కు అర్హత సాధించారని ఎస్ఎస్‍సీ పేర్కొంది. మొత్తంగా 16,160 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్‍కు క్వాలిఫై అయ్యారు. ఈ జాబితాలన్నీ ssc.nic.in వెబ్‍సైట్‍లో అందుబాటులో ఉన్నాయి.