Thursday, March 30, 2023

Taraka Ratna: పెళ్లి తర్వాత వివక్షకు గురయ్యాం.. తారకరత్న వైఫ్ ఎమోషనల్ పోస్ట్

తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి తారకరత్న (Taraka Ratna) చిన్న వయసులోనే మరణించారు. జనవరి 27న టీడీపీ తలపెట్టిన పాదయాత్రలో పాల్గొన్న సమయంలోనే గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయారు. బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో 23 రోజుల పాటు మెరుగైన వైద్య చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఇక తారకరత్న మరణించి అప్పుడే నెల రోజులు గడిచిపోగా.. ఆయనను తలచుకుంటూ వైఫ్ అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ (Emotional Post) షేర్ చేసింది. ఇందులో ప్రధానంగా పెళ్లి తర్వాత తాము ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంది.

‘నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లి నెల రోజులవుతున్నా నీ జ్ఞాపకాలు నా మనసులో చాలా పదిలంగా ఉన్నాయి. మనం కలిశాం, కొన్ని రోజులకే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. మన రిలేషన్‌షిప్ గురించి నాకు అప్పుడు ఖచ్చితంగా తెలియలేదు. కానీ మన జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించేందుకు నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొన్నావు. చివరకు పెళ్లి చేసుకున్నాం, అక్కడ గందరగోళం ఏర్పడింది, వివక్షకు గురయ్యాం. అయినా సర్వైవ్ అయ్యాం. మీ వల్లే సంతోషంగా ఉన్నాం.. నిష్కమ్మ తర్వాత మన సంతోషం రెట్టింపయింది, కానీ బాధలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ద్వేషాన్ని కళ్లు మూసుకుని సహించాం’ అని కంటిన్యూ చేసింది.


‘2019లో మనకు కవలల రూపంలో పెద్ద సర్‌ప్రైజ్ వచ్చింది. నాకు ఇంకా గుర్తుంది, మీరు ఎప్పుడూ పెద్ద కుటుంబాన్నే కోరుకునేవారు. మీరు మీ కుటుంబాన్ని కోల్పోయారు కాబట్టి మాకు అందమైన కుటుంబాన్ని అందించారు.. ఇన్నేళ్లు, చివరి వరకు మీరు పడ్డ స్ట్రగుల్స్ అన్నీ నిజమైనవే.. మీ గుండెల్లో మోస్తున్న బాధను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే సొంత మనుషులచే బాధించబడితే కొన్నిసార్లు అది మానసికంగా కుంగదీస్తుంది. మీరు ఎదుర్కొన్న బాధల పట్ల నేను సాయం చేయలేకపోయాను.. మొదటి నుంచి మనకు అండగా నిలబడిన వ్యక్తులే చివరి వరకు ఉన్నారు. కానీ మీరు దూరం వెళ్లిపోయారు. మీ సమాధిపై కూడా మిమ్మల్ని కనుగొనలేకపోయాం. ఒక కుటుంబంగా, ఈ తక్కువ వ్యవధిలో కూడా మీతో ప్రయాణాన్ని కలిగి ఉన్నందుకు మేము గర్విస్తున్నాం’ అంటూ #tarakratna #balayya #balayyababu #nishkahope #vijaysaireddy #nbk #jaibalayya #vsr హ్యాష్ ట్యాగ్స్ జతచేసింది అలేఖ్య రెడ్డి.

ఇక అలేఖ్య రెడ్డి పోస్ట్ చూసిన నెటిజన్లు.. ఆమెకు ధైర్యం చెబుతున్నారు. పిల్లల్లో తారకరత్న గారిని చూసుకోవాలని, స్ట్రాంగ్‌గా లైఫ్ లీడ్ చేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, తారకరత్నకు మొదటి నుంచి బాబాయ్ బాలయ్య అండగా ఉన్నారని తెలిసిందే.

Latest news
Related news