Thursday, March 30, 2023

Ram Charan: విరాట్ కోహ్లి బయోపిక్‌లో రామ్ చరణ్.. మనసులో మాట చెప్పిన మెగాపవర్ స్టార్

Ram Charan – Virat Kohli: ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై బ‌యోపిక్స్‌కు ఎప్పుడూ మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. ఓటీటీల ప్ర‌భావం పెర‌గ‌టం వ‌ల్ల ఈ బ‌యోపిక్స్ హ‌వా మ‌రింత పెరిగాయే కానీ త‌గ్గ‌లేదు. ఈ బ‌యోపిక్స్‌లో స్టార్ హీరోలు నటించ‌టం వ‌ల్ల వాటికి ఫ్యాన్స్‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ క్రేజ్ భారీగా ఉంటుంది. రీసెంట్‌గా నాటు నాటు పాటలో డాన్స్‌తో దుమ్ము రేపి ఆస్కార్ రావ‌టంలో త‌న వంతు పాత్ర‌ను పోషించిన హీరో రామ్ చ‌ర‌ణ్ మీడియా ముందుకు వ‌చ్చారు. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న తెలియ‌జేశారు.

ఇదే క్ర‌మంలో ఎవ‌రి బ‌యోపిక్‌లో అయినా న‌టించే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రి బ‌యోపిక్‌లో న‌టిస్తారు అని ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు రామ్ చ‌ర‌ణ్ పెద్ద‌గా ఆలోచించ‌లేదు. ఆయ‌న చెప్పిన స‌మాధానం విరాట్ కోహ్లి. ‘నేను చాలా రోజులుగా స్పోర్ట్స్ బేస్డ్ మూవీలో నటించాలని అనుకుంటున్నాను. ఆ అవ‌కాశం వ‌స్తే మాత్రం క‌చ్చితంగా విరాట్ కోహ్లి బ‌యోపిక్‌లో న‌టిస్తాను. ఎందుకంటే విరాట్ కోహ్లి చాలా ఇన్‌స్పైరింగ్ ప‌ర్స‌నాలిటీ. త‌ను బ‌యోపిక్‌లో న‌టించే చాన్స్ వ‌స్తే వదులుకోను’’ అని బదులిచ్చారు రామ్ చరణ్.

RRR సినిమాలో నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ సాధించిన తొలి చిత్రంగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ అవార్డ్ త‌ర్వాత తెలుగు సినిమా స్థాయి మ‌రింత పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్ సినిమాల‌పై ఫోక‌స్ మ‌రింత ఎక్కువైంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో RC 15 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఎన్నికల అధికారికగా కనిపించబోతున్నారు. CEO అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉంది. వ‌చ్చే సంక్రాంతి సినిమా రిలీజ్ అవుతుంది. చ‌ర‌ణ్ బ‌ర్త్ డే మార్చి 27. ఈ సంద‌ర్బంగా చెర్రీ – శంక‌ర్ మూవీ టైటిల్, గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. శంక‌ర్ మూవీ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయటానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

ALSO READ: NTR 30: నెక్ట్స్ సినిమా చెయ్య‌ట్లేదు.. ఆపేస్తాను కూడా..ఫ్యాన్‌కి ఎన్టీఆర్ ఆన్స‌ర్‌
ALSO READ: Siva Krishna: అది వెబ్ సిరీస్ కాదు బ్లూ ఫిల్మ్‌.. సీనియర్ నటుడు శివ కృష్ణ ఫైర్‌

Latest news
Related news