గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు స్థానాలను గెలిచిందని లోకేశ్ అన్నారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయం ఈ ఫలితాలతో అర్థమవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో మార్పునకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు శ్రీకారం చుట్టాలని తాము ప్రజలకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు తమ ఓటుతో ప్రజాస్వామ్యాన్ని బతికించుకున్నారని చెప్పారు. మొదట అభ్యర్థులను, తర్వాత ఓటర్లను వైసీపీ నేతలు ప్రలోభపెట్టారని లోకేశ్ ఆరోపించారు. చివరికి దొంగ ఓట్లు సృష్టించి… 6,7వ తరగతి చదివిన వాళ్లతో పట్టభద్రుల ఓట్లను వేయించారని ఆగ్రగం వ్యక్తం చేశారు. కానీ డబ్బు బలం, అధికార బలం, అవినీతి బలం… ఏవీ కూడా ప్రజల నిర్ణయాన్ని మార్చలేకపోయాయని చెప్పుకొచ్చారు. జగన్ మీదున్న అసంతృప్తిని చల్లార్చ లేకపోయాయంటూ కామెంట్స్ చేశారు.
BREAKING NEWS