KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 188 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్ష్య చేధనలో భారత్ 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ ఓపికగా బ్యాటింగ్ చేశాడు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాతో కలిసి జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రాహుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
BREAKING NEWS