ఫ్యామిలీ రీజన్స్‌తో ఈ వన్డేకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దాంతో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ గెలిచి.. ఆస్ట్రేలియాని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే.. ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5) ఆరంభంలోనే సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డవగా.. అనంతరం వచ్చిన స్టీవ్‌స్మిత్ (22), మార్కస్ లబుషేన్ (15) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. కానీ.. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మిచెల్ మార్ష్ (81: 65 బంతుల్లో 10×4, 5×6) దూకుడుగా ఆడేశాడు. గాయం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా.. బంతిని చక్కగా మిడిల్ చేస్తూ భారీ సిక్సర్లు కొట్టాడు.
కానీ.. టీమ్ స్కోరు 129 వద్ద మూడో వికెట్‌గా మిచెల్ మార్ష్ ఔటైపోయిన తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాలో తడబాటు మొదలైంది. కామెరూన్ గ్రీన్ (12), జోష్ ఇంగ్లీస్ (26), గ్లెన్ మాక్స్‌వెల్ (8), మార్కస్ స్టాయినిస్ (5), సీన్ అబాట్ (0), ఆడమ్ జంపా (0) వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. మిచెల్ స్టార్క్ (4 నాటౌట్: 10 బంతుల్లో 1×4) అలానే క్రీజులో ఉండిపోయాడు. గాయంతో ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఆడలేదు.
Read Latest Sports News, Cricket News, Telugu News