Aadhaar Update: భారతీయులకు ఆధార్ కార్డు అనేది అత్యంత అవసరం. మనకు అడ్రస్ ప్రూఫ్‌గా, గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఎన్నో పథకాలకు ఆధార్ కార్డు అనేది అత్యంత అవసరం పడుతుంది. ఇది ఎప్పుడూ మన దగ్గరు ఉంచుకోవడం ముఖ్యం. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో చెప్పలేం. అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఆధార్ కార్డు మర్చిపోతుంటాం. అదే సమయంలో మీకు కచ్చితంగా ఆధార్ కార్డు అవసరం పడిందనుకోండి. అయినా పర్లేదు. ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. డిజిటల్‌గా అందులో సైన్ చేసి ఉంటుంది. దీనికి ఇంకా పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇది భౌతిక కార్డు మాదిరిగానే ఉపయోగపడుతుంది. అవసరం ఉన్న అన్ని చోట్ల దీనిని చూపిస్తే సరిపోతుంది. అప్పుడు ఇక ఆధార్ కార్డును మీ వెంట క్యారీ చేయాల్సిన పనిలేదు. అందుకోసం UIDAI అవకాశం కల్పిస్తుంది. ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇక ఈ ఆధార్ కార్డుతో టైమ్ సేవ్ అవుతుంది. ఎవరికైనా అవసరం ఉంటే వెంటనే డిజిటల్ కాపీని షేర్ చేయొచ్చు. మీకు సౌకర్యంగా కూడా ఉంటుంది. ఇక ఆధార్ కార్డు కోసం ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సిన పని కూడా ఉండదు.
ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే UIDAI (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in లేదా eaadhaar.uidai.gov.in కు వెళ్లాలి. అక్కడ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చూడండి.
uidai.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే.. అక్కడ హోం పేజీలో My Aadhaar ట్యాబ్ కింద Download Aadhaar అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేయాలి.
అప్పుడు మిమ్మల్ని మరో పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మీ పూర్తి పేరు, పిన్ కోడ్, ఇమేజ్ క్యాప్చా ఎంటర్ చేయాలి.
గెట్ వన్ టైం పాస్‌వర్డ్‌పై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేయగానే.. డౌన్‌లోడ్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీకు ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
డౌన్‌లోడ్ అయిన కాపీకి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అక్కడ మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (క్యాపిటల్ లెటర్స్), మీ పుట్టిన తేదీ సంవత్సరం కలిపి ఎంటర్ చేయాలి.
ఇక ఆధార్ కార్డులో ఏదైనా అప్‌డేట్స్ చేసుకోవాలనుకున్నా ప్రస్తుతం UIDAI అదిరిపోయే ఆఫర్ ఉంచింది. జూన్ 14 వరకు దీనిని ఆన్‌లైన్‌లో ఉచితంగా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. బయట ఎక్కడైనా చేయించుకుంటే డబ్బులు చెల్లించాలి.
Work From Home: 10 వేల మంది ఉద్యోగుల్ని పీకేసి టెక్ కంపెనీ ఇప్పుడు మరో కీలక ప్రకటన.. ఇక అది కుదరదంటూ!
Google Employees: ఏకమైన వందలాది గూగుల్ ఉద్యోగులు.. Sundar Pichai కు ఓపెన్ లెటర్.. తమ డిమాండ్లకు ఒప్పుకోకుంటే..!