Friday, March 31, 2023

సినీ ఫక్కీలో చేజింగ్; పంజాబ్ లో ఖలిస్తానీ నేత కోసం వేట-operation to arrest amritpal singh 10 close associates in police net


Operation Amritpal Singh: చేజింగ్.. చేజింగ్

అమృత్ పాల్ సింగ్ ఎక్కడెక్కడ ఉంటున్నాడనే విషయాన్ని గత వారం రోజులుగా పోలీసులు సేకరించారు. శనివారం అమృత్ పాల్ సింగ్ ఎక్కడున్నాడనే విషయాన్ని నిర్ధారణగా తెలుసుకున్న తరువాత ఆయనను అరెస్ట్ చేయడం కోసం జలంధర్ లోని మహత్ పూర్ ప్రాంతానికి భారీ బలగంతో చేరుకుంది. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) వాహన శ్రేణిని చుట్టుముట్టింది. కానీ, అక్కడ భారీ వాహన శ్రేణిలో వెళ్తున్న వారిస్ పంజాబ్ దే (Waris Punjab De) చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయలేకపోయింది. పోలీసుల కన్ను గప్పి వేరే వాహనంలోకి మారి అమృత్ పాల్ సింగ్ పారిపోగలిగాడు. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరులైన 10 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, అమృత్ పాల్ సింగ్ పారిపోతున్న వాహనాన్ని పెద్ద సంఖ్యలో పోలీస్ వాహనాలు చేజ్ చేశాయి. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) వెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేస్తున్న దృశ్యాలున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదివారం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని, పుకార్లను నమ్మవద్దని, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.



Source link

Latest news
Related news