Amritpal Singh arrested: ఖలిస్తాన్ అనుకూల నేత, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు పెద్ద ఆపరేషన్ నే చేపట్టాల్సి వచ్చింది. పకడ్బందీ ప్రణాళికతో వచ్చినా, అరెస్ట్ చేయలేకపోయారు. వేరే వాహనంలో ఆయన తప్పించుకుని పోగా, చేజ్ చేసి మరీ అరెస్ట్ చేశారు. పంజాబ్ వ్యాప్తంగా ఇంటర్ నెట్ ను నిలిపేశారంటే, ఈ అరెస్ట్ ఎలాంటి పర్యవసానాలకు దారి తీసే అవకాశముందని పోలీసులు ఆలోచించారో అర్థమవుతుంది. ఇంతకీ ఎవరీ అమృత పాల్ సింగ్? ఆయనకు ఎందుకంత ఫాలోయంగ్?