Russia Ukraine war: అవధులు లేని స్నేహం
యుద్ధం ప్రారంభమైన దాదాపు సంవత్సరం తరువాత చైనా ఉక్రెయిన్ కు ఫోన్ చేయడంపై అంతర్జాతీయ సమాజంలో ఆసక్తి నెలకొంది. రష్యా తమకు అత్యంత సన్నిహిత మిత్ర దేశమైనా.. ఉక్రెయిన్, రష్యా యుద్ధం (Russia Ukraine war) లో భారత్ బహిరంగంగా రష్యాకు మద్దతు తెలపలేదు. ఇది యుద్ధాల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే కాలం కాదని భారత ప్రధాని మోదీ ఇప్పటికే నిర్ద్వంద్వంగా ప్రకటించారు. కానీ, చైనా మాత్రం రష్యాతో తమది అవధులు లేని స్నేహమని 2022లో స్పష్టం చేసింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఇప్పటివరకు ఖండించలేదు. రష్యాపై యూరోప్ దేశాలు, నాటో ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు, అనూహ్యంగా ఉక్రెయిన్ కు చైనా ఫోన్ చేయడం వెనుక వ్యూహమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.