Adani Group: అదానీ గ్రూప్ కంపెనీలు ఇప్పుడిప్పుడే మళ్లీ ట్రాక్‌లోకి వస్తున్నాయి. అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను కొట్టివేస్తూ వస్తోంది అదానీ గ్రూప్. ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో ప్రధానంగా వినోద్ అదానీ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఆయనకు కంపెనీకి ఎలాంటి సంబంధాలు లేవని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న అదానీ గ్రూప్ ఎట్టకేలకు నిజాన్ని బయటపెట్టింది. అదానీ గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకులు గౌతమ్ అదానీ (Gautam Adani) పెద్ద సోదరుడు వినోద్ అదానీ (Vinod Adani) తమ కంపెనీ ప్రమోటర్ గ్రూప్‌లో ఒకరిగా వెల్లడించింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు, సెల్ కంపెనీల ఏర్పాటు, షేర్ల మానిప్యూలేషన్ వంటి వాటికి వినోద్ అదానీ ప్రధాన సూత్రధారిగా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ (Hindenburg Report) తర్వాత వినోద్ అదానీ స్టేటస్‌పై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానమిచ్చ్చింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో గురువారం ఈ విషయాన్ని బయటపెట్టింది.
‘అదానీ గ్రూప్‌లోని వివిధ లిస్టెడ్ కంపెనీలకు గౌతమ్ అదానీ, రాజేశ్ అదానీ వ్యక్తిగత ప్రమోటర్లుగా ఉన్నారని తెలియజేస్తున్నాం. వినోద్ అదానీ వారి బంధువు’ అని స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. అయితే, భారత దేశంలోని కంపెనీల రెగ్యులేషన్స్ ప్రకారం వినోద్ అదానీ కూడా అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్స్ గ్రూప్‌లో (Adani Promoter Group) భాగమే అవుతుంది.
వినోద్ అదానీ (74) అనే వ్యక్తి అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్, ఆఫ్‌షోర్ సెల్ కంపెనీలు వంటి వాటిలో ప్రధాన పాత్ర పోషించారని హిండెన్‌బర్గ్ నివేదిక గత జనవరిలో ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ మాత్రం ఆ ఆరోపణలను కొట్టి పారేసింది. అదానీ లిస్టెడ్ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థల్లో వినోద్ అదానీ ఎలాంటి మేనేజిరియల్ పోస్ట్‌లో లేరని, వాటి రోజు వారి వ్యవహారాల్లో ఆయన పాత్ర లేదని స్పష్టం చేసింది. అదానీ పోర్టిఫోలియో కంపెనీలు ఏదైనా సంస్థతో లావాదేవీలు జరిపినప్పుడు భారత చట్టాలు, నిబంధనల ప్రకారం అన్ని విషయాలను బహిర్గతం చేసినట్లు తెలిపింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అది భారత్‌పై ప్రణాళిక ప్రకారం జరుగుతున్న దాడిగా అభివర్ణించింది.
అయితే, భారత రెగ్యూలేటరీ అథారిటీలకు వివిధ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమర్పించిన నివేదికల్లో వినోద్ అదానీ గ్రూప్ ప్రమోటర్స్‌లో ఉన్నట్లు అదానీ గ్రూప్ చూపించడం గమనార్హం. మరోవైపు.. వినోద్ అదానీకి చెందిన ఎండియోవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేసింది.
Adani: పార్లమెంట్ సాక్షిగా ‘అదానీ’ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన..!
Adani: అదానీ కీలక నిర్ణయం.. రూ.3,700 కోట్లు లక్ష్యం.. అంబుజాలో 4.5 శాతం వాటా విక్రయం!
Adani: అదానీ ఇంట పెళ్లి సందడి.. చిన్న కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?