Friday, March 24, 2023

tcs ceo salary, TCS: టెక్ దిగ్గజం టీసీఎస్ CEO వేతనం ఎంతో తెలుసా? వారి కంటే చాలా తక్కువే! – tech giant tcs ceo rajesh gopinathans salary in 2022 compare to other it execs


TCS: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీరస్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రాజేశ్ గోపినాథన్ తన పదవికి రాజీనామా చేశారు. మరో నాలుగేళ్లు పదవీలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఊహించని విధంగా రాజీనామా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన స్థానంలో కె.కృతివాసన్‌ను తదుపరి సీఈఓగా నియమించుకున్నట్లు వెల్లడించింది టీసీఎస్. 2023, సెప్టెంబర్ 15 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు రాజేశ్ గోపినాథన్ (TCS CEO Rajesh Gopinathan). ఈ క్రమంలో సీఈఓ రాజేశ్ గోపినాథన్ వేతనంపై చర్చ కొనసాగుతోంది. ఆయన మిగితా సంస్థల సీఈఓలతో పోలిస్తే చాలా తక్కువ జీతం తీసుకున్నారని సమాచారం. గత ఏడాది ఎంత జీతం తీసుకున్నారు. ఇతర కంపెనీలతో పోలిస్తే ఆయనకు ఎందుకు తక్కువ వేతనం ఉంది?

టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ (TCS CEO Salary) వేతనం ఎంతో తెలుసా? ఏడాదికి రూ.25.75 కోట్లు మాత్రమే. 2021-22 ఆర్థిక ఏడాదికి గానూ గోపినాథన్ ఈ వేతనం అందుకున్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే అది 26 శాతం మేర పెరిగింది. అయినప్పటికీ ఇతర ఐటీ కంపెనీల సీఈఓలతో పోలిస్తే రాజేశ్ గోపినాథన్ వేతనం చాలా తక్కువ కావడం గమనార్హం.

ఐటీ కంపెనీల సీఈఓల వేతనాల పరంగా చూసుకున్నట్లయితే హెచ్‌సీఎల్ సీఈఓ సి విజయ్ కుమార్ తొలి స్థానంలో ఉన్నారు. ఆయన 2021-22 ఆర్థిక ఏడాదిలో విజయ్ కుమార్ రూ.123.13 కోట్లు వేతంగా తీసుకున్నారు. అయితే, టాప్ కంపెనీల్లో అతి ఎక్కువ వేతనం పొందుతున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో ఎక్కువ వేతనం తీసుకుంటున్న సీఈఓ ఆయనే కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో మరో దిగ్గజ సంస్థ విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే ద్వితియ స్థానాన్ని అక్రమించారు. ఆయన 2021-22 ఆర్థిక ఏడాదికి గానూ రూ.79.8 కోట్లు వేతనం అందుకున్నారు. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ.71.02 కోట్లు వేతనం తీసుకుంటూ మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు.. టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.63.4 కోట్లు వేతనం అందుకుని నాలుగో స్థానంలో ఉన్నారు. వారి తర్వాతే టీసీఎస్ సీఈఓ గోపినాథన్ ఉన్నారు.

ఇటీవల వరుసపెట్టి దిగ్గజ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారు రాజీనామాలు చేస్తున్నారు. ఇటీవలే ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తన పదవికి రాజీనామా చేశారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓగా చేరారు. ఈ ఏడాది డిసెంబర్‌లో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మోహిత్ జోషి బాధ్యతలు చేపడతారు. తాజాగా టీసీఎస్ సీఈఓ అండ్ ఎండి రాజేశ్ గోపీనాథన్ ఎవరూ ఊహించని విధంగా రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆయన ఏ సంస్థలోనూ చేరినట్లు సమాచారం బయటకు రాలేదు.

TCS: టీసీఎస్‌లో ఊహించని పరిణామం.. CEO గోపినాథన్ రాజీనామా.. కారణమేంటి?Infosys: ఇన్ఫోసిస్‌లో కీలక పరిణామం.. మరో కీలక వ్యక్తి గుడ్‌ బై.. ప్రెసిడెంట్ మోహిత్ రాజీనామాSiddhartha Mohanty: Adani Group లో పెట్టుబడులపై ఆరోపణలు.. LIC కి కొత్త ఛైర్మన్.. ఆకస్మిక మార్పు అందుకేనా?Source link

Latest news
Related news