నాకు 34 ఏళ్లు. నేను నా భర్త, మా రెండేళ్ల కొడుకు యూఎస్‌లో ఉంటున్నాం. మా పేరెంట్స్ ఇండియాలో ఉంటున్నారు. నా లైఫ్ చాలా బోరింగ్‌గా తయారైంది, నా జీవితంలో నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే, నా భర్తకు నా మీద ప్రేమ చూపించడం రాదు, చాలా అరుదుగా నన్ను స్పెషల్‌గా, ప్రేమగా చూసుకుంటాడు. నా భర్తను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, అతని చుట్టూ ఉండటం నాకు ఎంతో ఇష్టం. అది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. దురదృష్టవశాత్తు, నా భర్త వర్క్‌హోలిక్, కుటుంబానికి తన టైమ్ కేటాయించడు.