అత్యధిక శాలరీ తీసుకున్న సీఈఓల్లో ఒకరు..
టీసీఎస్ సీఈఓ అండ్ ఎండీగా రాజేశ్ గోపీనాథన్ ప్రపంచంలోనే అత్యధిక శాలరీ అందుకున్న ఉన్నత స్థాయి అధికారుల్లో ఉన్నారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో ఆయన పరిహారం 26.6 శాతం పెరిగి రూ.25.75 కోట్లకు చేరింది. అందులో జీతం రూ.1.5 కోట్లుగా ఉండగా.. ఇతర బెనిఫిట్స్ అలవెన్సెస్ రూ.2.25 కోట్లుగా ఉన్నాయి. మొత్తం కమీషన్ రూ.22 కోట్లుగా ఉంది. టీసీఎస్ రెమ్యూనరేషన్‌ను శాలరీ, బెనిఫిట్స్, అలవెన్సెస్, కమిషన్ (వేరియేబుల్ కాంపోనెంట్) వంటి వాటితో మేనేజింగ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు శాలరీలు అందిస్తుంది. రాజేశ్ గోపినాథ్ టీసీఎస్ ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటిగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించారని చెబుతారు. ఆయన తిరుచీలోని ఎన్ఐటీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందారు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి పోస్ట్‌గ్రాడ్యూయెట్ డిప్లమా ఇన్ మేనేజ్‌మెంట్ చేశారు.
ఆయనను మరో ఐదేళ్లు టాప్ ఎగ్జిక్యూటివ్‌గా పొడిగిస్తూ మార్చి 2022లో సంస్థ నిర్ణయం తీసుకుంది. అంటే ఫిబ్రవరి 21, 2022 నుంటి ఫిబ్రవరి 20, 2027 వరకు ఆయన ఉన్నత పదవిలో కొనసాగే వీలుంది. అయితే, ఇలా ఊహించని విధంగా ఆయన రాజీనామా చేయడం గమనార్హం. అందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
- Read Latest Business News and Telugu News