Sunday, April 2, 2023

Mahesh Babu: SSMB 29లో హాలీవుడ్ భామ‌ను రంగంలోకి దించుతున్న జ‌క్క‌న్న‌.. పెద్ద స్కేచ్చే ఇది

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి బాహుబ‌లితో ప్ర‌పంచం అంతా త‌న‌వైపు చూసే చేసుకున్నారు. త‌ర్వాత వ‌చ్చిన‌ RRRతో ఏకంగా ఆస్కార్ అవార్డును త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు అంద‌రి దృష్టి ఆయ‌న నెక్ట్స్ మూవీ ఉంది. ఈసారి హాలీవుడ్ సైతం రాజ‌మౌళి టేకింగ్, మేకింగ్‌ల‌ను ప‌రిశీలిస్తుంది. కాబ‌ట్టి ఆయ‌న మ‌రింత కేర్‌ఫుల్‌గా సినిమా చేస్తార‌న‌టంలో డౌటేమీ అక్క‌ర్లేదు. ఇప్ప‌టికే మ‌న జ‌క్క‌న్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో తదుప‌రి సినిమా ఉంటుంద‌ని అనౌన్స్ చేసేశారు. చేయ‌ట‌మే కాదు.. దానికి సంబంధించిన క‌థ‌ను రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి తండ్రి, పాన్ ఇండియా రైట‌ర్ అయిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌న్నీ ఓ ఎత్తు..ఆస్కార్ త‌ర్వాత చేస్తున్న SSMB 29 మ‌రో ఎత్తు. అందుక‌ని రాజ‌మౌళి ఈసారి హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్‌తో పాటు టెక్నీషియ‌న్స్‌తోనూ చేతులు క‌లుపుతున్నారు. ఇప్ప‌టికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో చేతులు క‌లిపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్ర‌ముఖ‌ హాలీవుడ్ న‌టీన‌టుల‌ను ఈ సినిమాలో న‌టింప చేయ‌టానికి ఒప్పిస్తుంది. ఇది వ‌ర‌కే ఈ సినిమాలో థోర్ మూవీ యాక్ట‌ర్ క్రిస్ హెమ్స్ వ‌ర్త్ ఈ సినిమాలో న‌టిస్తార‌నే టాక్ ఉంది. కాగా.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌గా హాలీవుడ్ భామ‌ను రంగంలోకి దించుతున్నార‌ట జ‌క్క‌న్న‌. ఇది తెలిసిన మీడియావ‌ర్గాలు జ‌క్క‌న్న స్కెచ్ మామూలుగా లేదురోయ్ అని అనుకుంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో పూజా కార్య‌క్ర‌మాల‌ను చేసి వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలో SSMB 29ను తెర‌కెక్కించేలా రాజ‌మౌళి ప్లాన్ చేసుకున్నారు.

జేమ్స్ బాండ్‌, ఇండియానా జోన్స్ త‌ర‌హా యాక్ష‌న్ మూవీని మ‌హేష్‌తో చేయ‌టానికి రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. గ్లోబెల్ రేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా SSMB 29ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే ద‌ర్శ‌క ధీరుడు కొన్ని ఇంట‌ర్వ్యూల్లో తెలియ‌జేశారు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.ఎల్.నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ మూవీ కాబ‌ట్టి మినిమం బ‌డ్జెట్టే రూ.500 కోట్లు అని టాక్‌. మ‌రి మేకింగ్‌లో ఇదెంత మేర‌కు పెరుగుతుందో చూడాలి మ‌రి.

Latest news
Related news