Cash Limit at Home: కొంతకాలంగా ఐటీ శాఖ ప్రముఖుల ఇళ్లల్లో రైడ్స్ చేస్తోంది. చాలా వరకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీల ఇళ్లల్లోనే ఇలా జరుగుతుంటాయి. ఇక అప్పుడు ఇంట్లో లెక్కకు మించి డబ్బులు ఉంటే.. ఆ లెక్కలు సరిగా లేకుంటే వాటిని సీజ్ చేస్తుంటుంది. అందుకే అన్నింటికీ సరిగా లెక్కలు ఉండాలి. అయితే ఈ సమయంలోనే సగటు మనిషికి ఒక అనుమానం వస్తుంటుంది? అసలు ఇంట్లో ఎంత నగదు దాచుకోవచ్చు? ఎక్కువగా డబ్బులు నిల్వ చేసుకుంటే ఏదన్నా సమస్య వస్తుందా? ఐటీ శాఖ ఒకవేళ మీ ఇంట్లో రైడ్స్ చేస్తే అప్పుడు ఎక్కువ డబ్బులు ఉంటే ఎలా? ఇలాంటి ప్రశ్నలు మీకెప్పుడైనా వచ్చాయా? భారతదేశంలో జనం సాధారణంగా డబ్బులు ఇళ్లలోనే ఉంచుకోవడం కామన్. పాతకాలం నుంచే ఇది సంప్రదాయంగా వస్తోంది. ఇంకొందరు బ్యాంకుల్లో దాచుకుంటుంటారు. ఇన్వెస్ట్‌మెంట్లు పెడుతుంటారు. ఈ మధ్య బ్యాంకులు కూడా దివాలా తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల్లో నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకొని.. ఇంట్లో ఎంత వరకు ఉంచుకోవచ్చు అనే ప్రశ్నలు మెదులుతున్నాయి.
నగదును దాచుకునేందుకు బ్యాంకులు, పలు ఫైనాన్స్ కంపెనీలు ఎన్నో సదుపాయాలు, పథకాలు తీసుకొస్తున్నప్పటికీ ప్రజలు తమ దగ్గర కచ్చితంగా ఎంతో కొంత డబ్బు ఉంచుకుంటారు. అత్యవసర సమయంల అవసరం పడుతుందనో, ఇంకేదైనా.. డబ్బులు ఇంట్లో ఉండే వారిని చూస్తూనే ఉంటాయి. అయితే డబ్బులు ఇంట్లో ఎంత వరకు దాచుకోవచ్చు.. ఐటీ శాఖ రూల్స్ ఏం చెబుతున్నాయి..
ఇళ్లల్లో ఎంత నగదు అయినా నిల్వ చేసుకోవచ్చు. ఇంత వరకే ఉండాలనే కచ్చితమైన నిబంధన లేదు. ఆదాయపు పన్ను శాఖ కూడా ఇంత డబ్బు ఉండాలని చెప్పదు. అయితే.. ఇంట్లో ఉన్న డబ్బులకు లెక్కలుండాలి. ఎంత డబ్బు ఉంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అన్నది మీరు ఐటీ శాఖకు చెప్పగలగాలి. ఆ సమాచారం మీ దగ్గర ఉండాలి. సదరు పత్రాలు/ డాక్యుమెంట్లు కూడా ఉంటే ఇంకా మంచిది. అప్పుడు ఎలాంటి చిక్కులు ఉండకపోవచ్చు.
ఇక బిజినెస్‌లో వస్తే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉండాలి. ప్రతి పైసాకు లెక్క అడుగుతారు. ఇదే సమయంలో ఒక చిక్కు ఉండొచ్చు. మీరు ట్యాక్స్ కడుతున్నారా లేదా అనేది చూస్తారు. లేకుంటే పన్ను ఎగవేత కింద చట్టపర చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ డబ్బుకు సరైన లెక్క లేకుంటే.. దానిని సీజ్ చేసే అధికారం ఐటీ శాఖకు ఉంటుంది. వ్యవసాయం ద్వారా వచ్చినట్లయితే సదరు బిల్లు కూడా ఉండాలి. ఇలా అన్ని విధాల జాగ్రత్తగా ఉండాలి.
మీ దగ్గర మొత్తం ఎంత నగదు ఉంది? మీ ఆదాయం ఎంత? ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇక ఇంట్లో ఉన్న డబ్బు పన్ను పరిధిలోకి వస్తే.. దానికి టాక్స్ చెల్లించాల్సిందే. ఇక లెక్కకు మించిన డబ్బులు ఉంటే.. డబ్బు సీజ్ చేయడంతో పాటు దానిపై అదనంగా 37 శాతం వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అందుకే డబ్బును వీలైనంత తక్కువగా డబ్బును ఇంట్లో ఉంచుకోవడమే మంచిది. అన్ని పత్రాలు మన దగ్గర ఉండకపోవచ్చు.
Fake Jobs: Hyderabad లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. IT ఉద్యోగాల పేరిట భారీ మోసం.. ఎలా నమ్మించారో తెలుసా?
Meta Employee: గర్భిణీ అని కూడా చూడకుండా ఇంత అమానుషంగా ఎలా.. కాస్తయినా దయలేదా మార్క్ అంటూ!
DLF: రికార్డు స్థాయిలో Flats అమ్మకాలు.. కట్టకముందే మూడే రోజుల్లో రూ.8 వేల కోట్ల సేల్స్.. ఒక్కో ఫ్లాట్ ధర తెలిస్తే..