మొత్తంగా చూస్తే… ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల ఫలితం తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటుందని ఏపీ హైకోర్టు బుధవారం పేర్కొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపును యథాతథంగా నిర్వహించవచ్చునని స్పష్టం చేసింది. అయితే గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘ ప్రక్రియ.. అయితే ఈ ఫలితాల ప్రకటనకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఈసీ తెలిపింది.
BREAKING NEWS