Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో..
రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాద యాత్ర భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) జనవరిలో కశ్మీర్ (kashmir) లో ముగిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కశ్మీర్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగిస్తూ.. మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. లైంగిక హింసకు గురైన బాధితుల వివరాలను ఇస్తే, వారి నుంచి వివరాలు తీసుకుని, దోషులను పట్టుకుంటామని పేర్కొంటూ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి నోటీసులు పంపించారు. లైంగిక దాడికి గురైన బాధితులకు న్యాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) లో చేసిన ప్రసంగంతో పాటు, సోషల్ మీడియా పోస్ట్ లను ఉటంకిస్తూ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఒక ప్రశ్నావళిని ఢిల్లీ పోలీసులు పంపించారు. లైంగిక హింసకు గురైన మహిళల వివరాలు ఇవ్వాలని అందులో ఆయనను కోరారు.